Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Hyderabad, పివిఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్ హైవే ఫ్లై ఓవర్ నుంచి వేలాడిన తాగుబోతు (video)

Advertiesment
Drunkard man dangles

ఐవీఆర్

, సోమవారం, 21 ఏప్రియల్ 2025 (19:44 IST)
ఇది ఎండా కాలమా లేదంటే తాగుబోతుల కాలమా అన్నట్లు వున్నది పరిస్థితి. ఈమధ్య కాలంలో ఎక్కడబడితే అక్కడ తాగుబోతులు హంగామా చేస్తున్నారు. మద్యం కిక్కు ఎక్కువై హైదరాబాదులోని పీవిఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్ ఫ్లై ఓవర్ పైన వున్న కేబుల్ వైర్లు పట్టుకుని కిందకి దిగాడు ఓ తాగుబోతు. అతడలా ప్రమాదకర రీతిలో వేలాడుతూ వుండటాన్ని గమనించిన స్థానికులు అతడిని కాపాడారు. కారు కవరును పట్టుకుని అతడు వేలాడుతున్న ప్రాంతంలో నిలబడ్డారు. తాగుబోతు ఫ్లైఓవర్ నుంచి జారి కారు కవరులో పడటంతో ప్రమాదం తప్పింది.
 
హరిద్వార్ రోడ్డుపై తాగుబోతు మహిళ
పూటుగా మద్యం సేవించి విచ్చలవిడిగా రోడ్లపై తూగుతూ తిరిగే మగవాళ్లను చూస్తుంటాం. కానీ మద్యం సేవించి రోడ్లపై వీరిలా తిరిగే ఆడవాళ్లను చూసి వుండము. ఐతే హరిద్వార్‌లో ఓ మహిళ పూటుగా మద్యం సేవించి బిజీ రోడ్డుపై వాహనాలను అడ్డుకుంటూ హంగామా సృష్టించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
 
xలో పోస్టు చేసిన వీడియోలో... రోడ్డు మధ్యలో ఓ మహిళ కార్లను ఆపుతూ అసౌకర్యాన్ని కల్గిస్తోంది. ఓ ఆటోలోకి ఎక్కి డ్రైవరు సీటులో కూర్చోబోయింది. అతి కష్టం మీద అతడు కిందకు దించడంతో అక్కడి నుంచి రోడ్డు మధ్యలో నడుస్తూ వాహనాలకు అంతరాయం కలిగించింది. చివరికి ట్రాఫిక్ పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

AI Job Threat లక్షల్లో ఉద్యోగుల పొట్ట కొట్టనున్న ఏఐ: ఒబామా, గేట్స్ ఆందోళన