హైదరాబాదులో డ్రగ్స్ రాకెట్‌ను ఈగల్ టీమ్ బయటపెట్టింది. రెస్టారెంట్లు వేదికగా డ్రగ్స్ వినియోగిస్తున్నట్లు ఈగల్ టీం గుర్తించింది. మల్నాడు, టేల్స్ ఆఫ్ తెలుగు రెస్టారెంట్ యజమాని సూర్య ఈ కేసులో కీలకంగా ఉన్నారని ఈగల్ టీం స్పష్టం చేసింది. ఈగల్ టీం ఆపరేషన్‌లో డ్రగ్స్ దందా బయటపడిందని వివరించింది.
హోటల్స్, రెస్టారెంట్స్, పబ్బు యజమానులు కలిసి డ్రగ్స్ వాడకం మొదలు పెట్టారని, వీరిలో సూర్య కీలక సూత్రధారిగా ఉన్నారన్నారు. ఈగల్ టీం కేసు నమోదు చేసిన వారిలో A-1గా కొంపల్లి, టేల్స్ ఆఫ్ తెలుగు రెస్టారెంట్ యజమాని సూర్య అన్నమనేని డ్రగ్ కింగ్‌పింగ్ గా తేల్చారు. ఈ దందాలో కీలకంగా ఉన్న 25 మంది ప్రముఖులపై కేసు నమోదు చేశారు.
ఫైనాన్షియల్ డిస్ట్రిక్‌లోని ప్రిజమ్ పబ్, జూబ్లిహిల్స్ ఫామ్ పబ్,మాదాపూర్‌లోని బర్డ్ బాక్స్, హైటెక్ సిటీలోని బ్లాక్ 22లో డ్రగ్స్ తదితర పబ్‌లు ఇందులో కీలకంగా ఉన్నాయని టీం వెల్లడించింది.