Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పబ్‌లో ఐపీఎస్ అధికారి భార్యను అలా తాకిన డాక్టర్.. తర్వాత ఏమైంది?

Advertiesment
pub

సెల్వి

, మంగళవారం, 24 సెప్టెంబరు 2024 (09:30 IST)
హైదరాబాద్, మదీనాగూడలోని ఓ పబ్‌లో ఐపీఎస్ అధికారి భార్యను అనుచితంగా తాకిన డాక్టర్‌పై గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. సెప్టెంబర్ 20న జరిగిన ఈ ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. ఘటన జరిగిన సమయంలో ఐపీఎస్ అధికారి వాష్‌రూమ్‌కు వెళ్లాడు. 
 
అతను తిరిగి వచ్చినప్పుడు, ప్రక్కనే ఉన్న టేబుల్‌లో ఉన్న వ్యక్తి తనతో అసభ్యంగా ప్రవర్తించాడని అతని భార్య అతనికి ఫిర్యాదు చేసింది. అతను తన భార్యను అనుకోకుండా తాకి ఉంటాడని భావించి మొదట్లో తాను పట్టించుకోలేదు. కానీ తన భార్య పట్టుబట్టడంతో సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా ఆ వ్యక్తి తన భార్యతో అసభ్యంగా ప్రవర్తించడం చూశాను. 
 
ఇక అక్కడితో ఆగకుండా గచ్చిబౌలి పోలీసులకు ఫోన్ చేశానని ఐపీఎస్ అధికారి తెలిపారు. నిందితుడు ఒక వైద్యుడు అని విచారణలో తేలింది. కొద్ది నిమిషాల్లోనే పబ్‌కు చేరుకున్న గచ్చిబౌలి పోలీసులు డాక్టర్‌ను అదుపులోకి తీసుకున్నారు.  
 
అయితే తాను మద్యం మత్తులో బాధితురాలిని తాకినట్లు వైద్యుడు పోలీసులకు చెప్పాడని తెలుస్తోంది. పోలీసులు డాక్టర్‌కు బ్రీత్‌ ఎనలైజర్‌ టెస్ట్‌ చేయగా, అతను మద్యం మత్తులో ఉన్నట్లు నిర్ధారించారు. 
 
మరుసటి రోజు తేరుకునే వరకు డాక్టర్‌ను పోలీస్ స్టేషన్‌లో కూర్చోబెట్టినట్లు పోలీసులు నివేదించారు. పబ్‌లోని సీసీటీవీ కెమెరాలను పరిశీలించి మేనేజర్‌ వాంగ్మూలాన్ని నమోదు చేసిన అనంతరం డాక్టర్‌పై ఫిర్యాదుగా తీసుకున్న పోలీసులు అతడిని విడిచిపెట్టారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు సర్కారు సిద్ధం: చంద్రబాబు