Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

లోక్‌సభ ఎన్నికలు : ఐదు జిల్లాల మంత్రులు - ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి

revanth reddy

ఠాగూర్

, మంగళవారం, 9 జనవరి 2024 (18:13 IST)
త్వరలో జరుగనున్న లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టిసారించారు. ఇందులోభాగంగా, ఆయన మంగళవారం డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి సంస్థ ప్రధాన కార్యాలయంలో ఐదు జిల్లాల ఇంచార్జ్ మంత్రులు, ఎమ్మెల్యేలతో ముగిసిన సీఎం రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించారు. 
 
జిల్లాల వారీగా ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, మహబూబ్ నగర్, హైదరాబాద్ నేతలతో సమావేశం నిర్వహించారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ గెలుపుకు కృషి చేయాలని సీఎం పిలుపునిచ్చారు. ఈ నెల 26 తరువాత జిల్లాల పర్యటనకు సీఎం వెళ్లనున్నారు. ఇందులోభాగంగా, ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో తొలి సభ నిర్వహించనున్నారు. 
 
గతంలో పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టగానే ఇంద్రవెల్లిలో భారీ సభను రేవంత్ రెడ్డి నిర్వహించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక తొలి సభ ఇంద్రవెల్లిలో నిర్వహించేలా ఆయన ప్లాన్ చేసుకున్నారు. ఇంద్రవెల్లి అమరుల స్మారక స్మృతి వనం కోసం శంఖుస్థాపన చేసేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదిలాబాద్ నేతలకు సూచించారు. ఇంద్రవెల్లి అమరుల కుటుంబాలను గుర్తించి ఆదుకుంటామని గతంలో సీఎం హామీ ఇచ్చారు. 
 
అసెంబ్లీ నియోజకవర్గాల అభివృద్ధి బాధ్యతలు ఉమ్మడి జిల్లాల ఇంచార్జి మంత్రులకు, సంక్షేమం, అభివృద్ధిలో అందరూ భాగస్వాములేనని భరోసా ఇచ్చిన సీఎం. తాను గత సీఎంలా కాదని తేల్చి చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్. జనవరి 26 తరువాత ఎమ్మెల్యేలకు అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. వారానికి మూడు రోజులు సాయంత్రం 4 నుంచి 6 వరకు సచివాలయంలో ఎమ్మెల్యేలకు అందుబాటులో ఉంటానన్న ఆయన తెలిపారు. 
 
పార్లమెంటు ఎన్నికల్లో రెట్టింపు ఉత్సాహంతో పని చేయాలని నేతలకు పిలుపునిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో కంటే ఎక్కువ ఓట్లు సాధించేలా కృషి చేయాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. 17లో 12కు తగ్గకుండా ఎంపీ స్థానాలు గెలిపించుకోవాలన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సమగ్రమైన, రిస్క్-మిటిగేటెడ్ పోర్ట్‌ఫోలియోను కోరుకునే పెట్టుబడిదారుల కోసం బంధన్ మల్టీ అసెట్ అలోకేషన్ ఫండ్