Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

డిజైన్, ఆర్ట్, ఆవిష్కరణలను పునర్నిర్వచిస్తూ ప్రారంభమైన డిజైన్ డెమోక్రసీ 2024

Advertiesment
image

ఐవీఆర్

, శుక్రవారం, 4 అక్టోబరు 2024 (17:56 IST)
హైదరాబాద్‌లో ఎదురుచూస్తున్న డిజైన్ ఫెస్టివల్ 'డిజైన్ డెమోక్రసీ 2024' నేడు ప్రారంభమైనది. అక్టోబర్ 4 నుండి 7వ తేదీ వరకు హైటెక్స్ హాల్స్ 1, 3లో జరుగనున్న ఈ ప్రదర్శన నగరం యొక్క సృజనాత్మక వాతావరణంను సమూలంగా మార్చనుంది. క్రియేటర్లు, ప్రొఫెషనల్స్ మరియు డిజైన్ ప్రేమికులకు నాలుగు రోజుల పాటు లీనమయ్యే అనుభవాన్ని అందించనుంది. 
 
ఈ ఫెస్టివల్ ను తెలంగాణ ప్రభుత్వ IT, E&C ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, శ్రీ జయేష్ రంజన్‌తో కలిసి శ్రీ పుల్లెల గోపీచంద్ (పద్మ భూషణ్ & పద్మశ్రీ అవార్డు గ్రహీత, చీఫ్ నేషనల్ కోచ్ - ఇండియన్ బ్యాడ్మింటన్ టీమ్), పింకీ రెడ్డి(ఫిక్కీ ఫ్లో మాజీ చైర్ పర్సన్) పల్లికా శ్రీవాస్తవ్ & శైలజా పట్వారీ(వ్యవస్థాపకులు, డిజైన్ డెమోక్రసీ) ప్రారంభించారు. 
 
"ఈ సంవత్సరం, తాము డిజైన్, కళ మరియు ఆవిష్కరణల సరిహద్దులను ముందుకు తీసుకువెళుతున్నాము" అని డిజైన్ డెమోక్రసీ వ్యవస్థాపకురాలు పల్లికా శ్రీవాస్తవ్ చెప్పారు. "సృజనాత్మక సహకారం అభివృద్ధి చేసే ప్రాంగణం సృష్టించడం తమ లక్ష్యమంటూ అనుభవజ్ఞులైన నిపుణులు మరియు అభివృద్ధి చెందుతున్న ప్రతిభావంతులకు స్ఫూర్తినిచ్చే రీతిలో దీనిని తీర్చిదిద్దామన్నారు. 
 
తెలంగాణ మ్యూజియం నుండి బ్రాండ్ డైరెక్టర్ మాన్సీ నేగి, క్యూరేటర్ సుప్రజా రావుతో కలిసి డిజైన్ డెమోక్రసీ 2024 వ్యవస్థాపకులు పల్లికా శ్రీవాస్తవ్, శైలజా పట్వారీ మరియు అర్జున్ రాఠీ నిర్వహిస్తున్న ఈ ఫెస్టివల్  అసాధారణమైన సృజనాత్మక ప్రతిభ, వినూత్న ప్రదర్శనల వేదికగా నిలిచింది.  సహ-వ్యవస్థాపకురాలు శైలజా పట్వారీ మాట్లాడుతూ, "నగరం యొక్క నైపుణ్యం, వినూత్న స్ఫూర్తి డిజైన్ డెమోక్రసీ 2024 యొక్క ప్రతి అంశంలోనూ  ప్రతిబింబిస్తుంది. ఈ వారసత్వాన్ని ఆధునిక ప్రపంచంలోకి తీసుకువచ్చే ప్లాట్‌ఫారమ్‌ను సృష్టించడం తమకు గర్వకారణం"అని అన్నారు. 
 
ఈ ఫెస్టివల్ కు హాజరైన వారిని లీనం చేయటానికి  శైలేష్ రాజ్‌పుత్ స్టూడియో, అర్జున్ రాఠీల అత్యాధునిక లైటింగ్ డిస్‌ప్లేల నుండి స్టూడియో స్మితా మోక్ష్ మరియు కడారి ఆర్ట్ గ్యాలరీ ద్వారా అద్భుతమైన కళాఖండాల వరకు, రోసాబాగ్, రవీష్ వోహ్రా హోమ్ మరియు సరితా హండా వంటి బ్రాండ్‌ల నుండి వినూత్నమైన ఫర్నిచర్ కలెక్షన్ల వరకూ ఇక్కడ ప్రదర్శితమవుతున్నాయి. సుప్రజా రావుచే నిర్వహించబడిన తెలంగాణ మ్యూజియం ప్రదర్శన తెలంగాణ ప్రతిభకు, నైపుణ్యానికి నిజమైన వేడుక.
 
ఎగ్జిబిషన్‌లతో పాటు, పలువురు నిపుణులతో ప్యానెల్‌ చర్చలు సైతం జరుగుతున్నాయి: ఇంటీరియర్ డిజైన్ ను పర్యావరణ అనుకూల పదార్థాలు ఎలా మారుస్తున్నాయో దానిపై దృష్టి సారించి 'ది ఫ్యూచర్ ఆఫ్ సస్టైనబుల్ డిజైన్', డిజైన్‌లో సాంకేతికత పాత్ర, సృజనాత్మక ప్రక్రియలో AI, VR మరియు ఆటోమేషన్ యొక్క ప్రభావాన్ని తొలిరోజు చర్చించారు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎలాగైనా రేవంత్ రెడ్డిని ఇరకాటంలో పెట్టాలన్నదే బీఆర్ఎస్ ప్లాన్ : కేవీపీ (Video)