రవీంద్రభారతిలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహ ఏర్పాటుపై వివాదం చెలరేగింది. అయితే తెలంగాణలో బాలు విగ్రహ ఏర్పాటు అంశం తెలంగాణ ఆత్మ గౌరవ అంశాన్ని మరోసారి వెలుగులోకి తెచ్చింది. డిసెంబర్ 15వ తేదీన ఎస్పీబీ జన్మదినాన్ని పురస్కరించుకుని రవీంద్ర భారతిలో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు తెలంగాణ సర్కారు ఏర్పాట్లు చేస్తోంది. దీనిని తెలంగాణ వాదులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఎస్పీబీకి రవీంద్ర భారతి వంటి తెలంగాణ సాంస్కృతిక కేంద్రంలో విగ్రహం ఎందుకని తెలంగాణ ఉద్యమ కారుడు పృథ్వీరాజ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసారు.
తెలంగాణ కళాకారులు గద్దర్, అందెశ్రీ వంటి వారి విగ్రహాలకు ముందు ప్రాధాన్యత ఇవ్వాలని.. ప్రాంతీయ గుర్తింపును కాపాడుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో కొద్దిసేపు రవీంద్ర భారతి ప్రాంగణంలో ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలో శుభలేఖ సుధాకర్‌తో పాటు పృథ్వీరాజ్‌ల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.