Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హైదరాబాద్ ఔటర్ టోల్ టెండర్లపై విచారణకు సీఎం రేవంత్ ఆదేశం!

revanthreddy

వరుణ్

, గురువారం, 29 ఫిబ్రవరి 2024 (09:43 IST)
హైదరాబాద్ ఔటర్ టోల్ టెండర్లపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విచారణకు ఆదేశించారు. టెండర్ల ఖరారుపై పూర్తి వివరాలు సేకరించే బాధ్యతను హైదరాబాద్ మున్సిపల్ డెవలప్‌మెంట్ అథారిటీ జాయింట్ కమిషనర్ అమ్రపాలికి అప్పగించారు. పూర్తి నివేదిక అందిన తర్వాత మంత్రివర్గంలో చర్చించనున్నట్టు సీఎం తెలిపారు. ఆ తర్వాత దర్యాప్తు బాద్యతలను సీబీఐ లేదా తత్సమాన సంస్థకు అప్పగిస్తామని ఆయన తెలిపారు. అలాగే, ఈ టెండర్లకు సంబంధించి ఫైళ్లు మాయమైనట్టు గుర్తిస్తే సంబంధిత బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆయన ఆదేశించారు. 
 
హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్డు టోల్ ట్యాక్స్ వసూలు టెండర్లలో అవకతవకలపై సమగ్ర విచారణ చేపట్టాలని, ప్రభుత్వానికి రావాల్సిన భారీ ఆదాయానికి గండిపడేలా తక్కువ మొత్తానికి టెండర్లు కట్టబెట్టిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హెచ్ఎండీఏపై బుధవారం ఆయన సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ప్రభుత్వానికి రావాల్సిన భారీ ఆదాయానికి గండిపడేలా టెండర్లు కట్టబెట్టిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీస ధర నిర్ణయించకుండా టెండర్లు ఎలా పిలిచారని అధికారులను ప్రశ్నించారు. ఇందులో ఎవరెవరి ప్రమేయముంది? ఏయే సంస్థలున్నాయి? బాధ్యులెవరూ? అన్న కోణాల్లో దర్యాప్తు చేయాలన్నారు.
 
ఈ టెండర్లలో జరిగిన అవకతవకలు, టెండర్ల విధివిధానాలు, ఫైళ్లు కదిలిన తీరుపై పూర్తి వివరాలు అందజేయాల్సిన బాధ్యతను హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్ ఆమ్రపాలికి అప్పగిస్తున్నాం. హెచ్ఎండీఏ నుంచి పూర్తి నివేదిక అందిన తర్వాత మంత్రివర్గంలో చర్చించి ఈ టెండర్ల వ్యవహారాన్ని సీబీఐ లేదా అదే స్థాయికి చెందిన మరో దర్యాప్తు సంస్థకు అప్పగిస్తాం అని ఆయన తెలిపారు. ఈ వ్యవహారానికి సంబంధించిన ఫైళ్లు మాయమైనట్టు గుర్తిస్తే బాధ్యులపై కేసులు నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ముహూర్త సమయానికి వరుడు రాలేదని బావను వివాహం చేసుకున్న వధువు.. ఎక్కడ?