తెలంగాణ రాష్ట్రానికి చెందిన మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి సోమవారం అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద రావుకు ఓ ఆసక్తికర విన్నపం చేశారు. సోమవారం కృష్ణా ప్రాజెక్టుకు, కేఆర్ఎంబీకి సంబంధించిన అంశాలపై సభలో చర్చ జరిగింది. ఈ చర్చ సందర్భంగా ఆయన సభాపతికి ఓ విజ్ఞప్తి చేశారు. అయ్యా సభాపతి గారు.. "నాదేమి లేదు. ఒక్కటే విషయం. ఒక్కటే సెకండ్. ఒక్క రిక్వెస్ట్ చేస్తున్నారు. 14, 15 తేదీల్లో వసంత పంచమి ఉంది. ఆ రోజున 26 వేల పెళ్ళిళ్ళు ఉన్నాయి. కాబట్టి సభ్యులందరి కోరిక మేరకు ఆ రెండు రోజులు అసెంబ్లీని పెట్టొద్దని సభాపతిని కోరుతున్నాను. మల్లారెడ్డి చేసిన విజ్ఞప్తితో సభలోని సభలోని సభ్యులంతా పగలబడి నవ్వారు.
సేద్యాన్ని నమ్ముకున్నందుకు పెళ్లిళ్ళు కావడం లేదు... సీఎంకు రైతుల మొర
సేద్యాన్ని నమ్ముకున్నందుకు తమకు పిల్లను ఇచ్చేందుకు, పెళ్లి చేసుకునేందుకు అమ్మాయిలు ముందుకు రావడం లేదని పలువురు యువ రైతులు వాపోతున్నారు. దీంతో తమకు 45 యేళ్ళు వచ్చినా అవివాహితులుగానే మిగిలిపోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే విషయంపై వారు ఏకంగా కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను కలిసి ఒక వినతి పత్రం అందజేశారు. ఇందులో యువ రైతులను పెళ్లి చేసుకునే అమాయికి రూ.5 లక్షలు నగదు ప్రాత్సాహక బహుమతి ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. సోమవారం రైతు సంఘాలతో జరిగిన భేటీలో సీఎం సిద్ధరామయ్యకు తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని వారు అందజేశారు.
కర్నాటక అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలకు ముందు సీఎం సిద్ధరామయ్య రైతు సంఘాల నేతలతో సమావేశమయ్యారు. వ్యవసాయ రంగానికి కేటాయింపులపై వారితో ఆయన చర్చించారు. వివిధ పథకాల అమలు, ప్రయోజనాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పథకాలపై రైతు సంఘాల నేతలు సంతృప్తి వ్యక్తం చేశారు. రైతు సంఘంలో పౌష్టికారం పెంపుదల, నీటి వనరుల అభివృద్ధి, వ్యవసాయ అధికారుల నైపుణ్యాల పెంపుదలకు అవసరమైన నిధులను బడ్జెట్‌లో కేటాయించాలని రైతులు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.
అదేసమయంలో సేద్యాన్ని నమ్మకుని, ఏటా లక్షలు అర్జిస్తున్నా కూడా యువ రైతులకు పెళ్లి కావడం లేదని సీఎం సిద్ధరామయ్య అన్నారు. ఈ పరిస్థితిని తప్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని, రైతులను పెళ్ళి చేసుకునే అమ్మాయికి ప్రభుత్వం తరపున నగదు ప్రోత్సాహం ప్రకటించాలని కోరారు.