Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మహిళల పట్ల బీఆర్‌ఎస్‌కు ఎటువంటి గౌరవం లేదు: కవిత ధ్వజం

Advertiesment
kavitha
మహిళల పట్ల బీఆర్‌ఎస్‌కు ఎటువంటి గౌరవం లేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కె. కవిత మంగళవారం తీవ్రంగా మండిపడ్డారు. సోమవారం జగిత్యాలలో జరిగిన బహిరంగ సభలో బీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర్ రావు గానీ, మరే ఇతర నాయకుడు గానీ మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి ఎందుకు ప్రస్తావించలేదని ఆమె ప్రశ్నించారు. 
 
బీఆర్ఎస్ నుండి సస్పెండ్ అయి, ఆ తర్వాత పార్టీని వీడిన కవిత, విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. మహిళలను అగౌరవపరచడం బీఆర్ఎస్‌కు కొత్తేమీ కాదని వ్యాఖ్యానించారు. ఆ పార్టీకి బీజేపీతో ఉన్న లోపాయికారి సంబంధం కూడా ఇప్పుడు దాగి ఉన్న రహస్యం ఏమీ కాదు.

ఊహించినట్లుగానే, ఈ బిల్లు విషయంలో బీజేపీకి గానీ, కేంద్ర ప్రభుత్వానికి గానీ వ్యతిరేకంగా ఒక్క మాట కూడా ఎవరూ మాట్లాడలేదు. దీనిని బట్టి చూస్తే, బీఆర్ఎస్ గతంలో ఎప్పుడూ మహిళలను గౌరవించలేదని, భవిష్యత్తులోనూ గౌరవించదని రుజువైంది.. అని చెప్పారు. 
 
బీఆర్ఎస్ తన వైఫల్యాలకు బాధ్యత వహించడానికి బదులుగా, ప్రతిదానికీ తెలంగాణ ప్రజలనే నిందిస్తూనే ఉందని ఆమె ఆరోపించారు. ఈ పార్టీ వెయ్యి సంవత్సరాలైనా మారదు, ఆ విషయాన్ని వారు మరోసారి నిరూపించుకున్నారని మండిపడ్డారు. మాజీ మంత్రి టి. జీవన్ రెడ్డిని బీఆర్ఎస్‌లోకి ఆహ్వానించడంపై స్పందిస్తూ, 75 ఏళ్ల ఆ నాయకుడిని యువకుడుగా చంద్రశేఖర్ రావు అభివర్ణించడం విడ్డూరంగా ఉందని ఆమె వ్యాఖ్యానించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారతదేశంలో 200 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యంను అధిగమించిన అల్ట్రాటెక్