Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

Yadagirigutta: యాదగిరిగుట్ట.. దర్శనం క్యూలైన్ గ్రిల్‌లో ఇరుక్కున్న బాలుడి తల (video)

Boy

సెల్వి

, ఆదివారం, 29 డిశెంబరు 2024 (15:18 IST)
Boy
సాధారణంగా ఆలయాల్లో క్యూలైన్‌లో నిల్చున్నప్పుడు పిల్లలు అక్కడ ఏర్పాటు చేసి ఉన్న గ్రిల్స్‌తో ఆడుకోవడం, వాటిపై ఎక్కి నిల్చోవడం, అందులో తల, చేతులు, కాళ్లు పెట్టడం లాంటివి చేస్తుంటారు. అలాంటి ఘటనే యాదగిరి గుట్టలో చోటుచేసుకుంది.
 
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దర్శనం క్యూలైన్‌ గ్రిల్లులో ఓ బాలుడి తల ఇరుక్కుంది. దీంతో ఆలయ పరిసరాల్లో కాసేపు గందరగోళ పరిస్థితి ఏర్పడింది. 
 
వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌ బోడుప్పల్‌కు చెందిన ఓ కుటుంబం శనివారం రాత్రి యాదాద్రికి చేరుకున్నారు. రూ.150 క్యూ లైన్లో ఉండగా.. పక్కనే ఉన్న గ్రిల్లో తల పెట్టాడు ఆరేళ్ల బాలుడు దయాకర్. భక్తులు, తల్లిదండ్రులు గమనించి గ్రిల్ నుండి బాలుడి తలను జాగ్రత్తగా బయటకు తీయడంతో పెను ప్రమాదం తప్పింది. 
webdunia
Boy
 
పిల్లాడికి ఏమీ కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

South Korea Plane Crash: దక్షిణ కొరియా విమాన ప్రమాదం.. 179మంది సజీవదహనం