Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Wednesday, 9 April 2025
webdunia

Barrelakka పెళ్లి: వరుడు ఎవరో తెలుసా?

Advertiesment
Barrelakka marriage

ఐవీఆర్

, సోమవారం, 25 మార్చి 2024 (16:37 IST)
Barrelakka బర్రెలక్క. ఈ పేరు తెలియని వారు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో వుండకపోవచ్చు. ఎందుకంటే బర్రెలక్క(శిరీష) తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కొల్లాపుర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. ఐతే ఎన్నికల్లో విజయం సాధించకపోయినప్పటికీ యువతను చైతన్యపరిచేందుకు తను ఎన్నికల్లో పోటీ చేస్తూ వుంటానని చెప్పుకొచ్చింది.
 
ఇక అసలు విషయానికి వస్తే బర్రెలక్క త్వరలో పెళ్లి చేసుకోబోతోంది. నిశ్చితార్థానికి సంబంధించి వీడియోను సోషల్ మీడియోల పంచుకున్నది. తను పెళ్లి చేసుకోబోతున్నానంటూ పోస్ట్ పెట్టిన దగ్గర్నుంచి వరుడు ఎవరంటూ చాలామంది ఆమెను ప్రశ్నించడం మొదలుపెట్టారు. దీనికి సమాధానంగా ఆమె ప్రి-వెడ్డింగ్ వీడియోను పోస్ట్ చేసింది.
 
మార్చి 28వ తేదీన తనకు పరిచయస్తుడైన వెంకటేష్ అనే యువకుడిని పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తుంది. అతడు ఎమ్మెస్సీ ఫిజిక్స్ పూర్తి చేసాడనీ, నాగర్ కర్నూలు జిల్లా పెద్ద కొత్తపల్లికి చెందినవాడని చెబుతున్నారు. కాగా శిరీష గతంలో ఆర్థిక ఇబ్బందులు కారణంగా డిగ్రీ చదివినా ఏ ఉద్యోగం రాకపోవడంతో బర్రెలు కాసుకుంటున్నానంటూ పెట్టిన పోస్ట్ ఆమెకి అనూహ్యంగా ఫాలోయర్స్‌ని పెంచింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భార్యతో గొడవలు.. కుటుంబ కలహాలు.. ఉరేసుకున్న జడ్జి