Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఓటుకు నోటు కేసు.. చంద్రబాబు, రేవంత్‌లకు శిక్ష తప్పదు... ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి

Alla Ramakrishna Reddy

సెల్వి

, గురువారం, 18 ఏప్రియల్ 2024 (16:48 IST)
Alla Ramakrishna Reddy
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఓటుకు నోటు కేసులో చంద్రబాబుని నిందితుడిగా చేర్చాలని, దర్యాప్తు సీబీఐకి అప్పగించాలని కోరుతూ వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. 
 
ఈ పిటిషన్‌పై సుప్రీం ధర్మాసనం గురువారం నాడు విచారణ చేపట్టింది. జస్టిస్ సుందరేష్, జస్టిస్ ఎస్.వి.ఎన్ భట్టి తో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించింది.
 
విచారణను జులై 24వ తేదీకి వాయిదా వేసింది ధర్మాసనం. సుప్రీంకోర్టు వేసవి సెలవుల అనంతరం కేసు విచారణ చేపడతామని జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ ఎస్విఎన్ భట్టిల ధర్మాసనం తెలిపింది.
 
ఈ నేపథ్యంలో ఈ కేసు సంబంధించి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో చంద్రబాబుకు ఈ కేసులో శిక్ష పడక తప్పదన్నారు. చంద్రబాబు, రేవంత్ రెడ్డి కుమ్మక్కయ్యారని ఓటుకు నోటు కేసుకు సంబంధించి.. ఒక ఓటుకు ఐదు కోట్లు బేరం చేసుకొని 50 లక్షలు అడ్వాన్స్‌గా ఇస్తూ ప్రపంచమంతా చూస్తుండగానే వీడియో, ఆడియోలతో అడ్డంగా పట్టుబడ్డ వ్యక్తలు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడులకు శిక్ష తప్పదన్నారు. 
 
అన్ని సాక్షాలు ఉన్న ఈ కేసు ముందుకు సాగకపోవడానికి కారణం చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేయడమేనని ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. ఏడేళ్ల నుంచి కేసు ముందుకు నడవకుండా రకరకాల కారణాలతో సాగదీస్తున్నారన్నారు. సుప్రీంకోర్టు జూలై 24 చివరి అవకాశం ఇచ్చిందని.. ఆపై ఈ కేసులో వాయిదాలు వుండనే విషయాన్ని ఆళ్ల రామకృష్ణా రెడ్డి గుర్తు చేశారు. ఈ క్రమంలో రేవంత్, బాబులకు కష్టాలు తప్పవని చెప్పుకొచ్చారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు-పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌