ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేరళలో పర్యటించనున్నారు. రెండు రోజుల పాటు కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ ఎన్నికల ప్రచార షెడ్యూల్‌లో భాగంగా ఆయన అలెప్పి, వాయనాడ్‌లలో పర్యటిస్తారు. కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్న దక్షిణాది రాష్ట్రానికి సీఎంగా, పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న రేవంత్ రెడ్డికి వాయనాడ్ నుంచి పోటీ చేయనున్న రాహుల్ గాంధీ సహా అభ్యర్థులకు మద్దతుగా ప్రచార బాధ్యతలు అప్పగించారు.
కేరళ నుంచి తిరిగి వచ్చిన ఆయన ఏప్రిల్ 19న మహబూబాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలో బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ తరపున ప్రచారం నిర్వహించేందుకు ఇప్పుడు.. సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగుతున్నారు.
ఎన్నికల ప్రచారానికి రావాలని ఇప్పటికే 7 రాష్ట్రాల పీసీసీల నుంచి రేవంత్ రెడ్డికి ఆహ్వానం అందింది. ఇందులో ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర, కేరళతో పాటు తమిళనాడు, బీహార్, గుజరాత్ రాష్ట్రాలు ఉన్నాయి.
మరోవైపు ఏప్రిల్ 19 నుంచి వచ్చే నెల 11 వరకు తెలంగాణలో సీఎం రేవంత్ సుడిగాలి పర్యటన చేయనున్నారు రేవంత్. దీంతో.. మొత్తంగా రేవంత్ రెడ్డి 50 బహిరంగ సభలతో పాటు 15 రోడ్ షోలలో పాల్గొననున్నారు.