ఓ యువతి తన వివాహానికి ముందు తన ప్రియుడితో కలిసి గోవా విహార యాత్రకు వెళ్లింది. అక్కడ తాము బస చేసిన హోటల్‌లో తన ప్రియుడుతో ఏకాంతంగా గడిపింది. దీన్ని హోటల్ సింబ్బంది రహస్యంగా వీడియో తీశారు. ఇపుడు ఆ వీడియోను ఆ మహిళకు చూపించి బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్నారు. దీంతో ఆందోళన చెందిన ఆ మహిళ పోలీసులను ఆశ్రయించింది. ఈ వీడియో ఇపుడు బయటకు వస్తే తన కాపురం కూలిపోతుంటూ పోలీసులను శరణు వేడుకుంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
హైదరాబాద్ ఎర్రగడ్డ ప్రాంతానికి చెందిన 35 యేళ్ల ఓ మహిళ గత 2023లో తన ప్రియుడితో కలిసి గోవా విహారయాత్రకు వెళ్లి సరదాగా గడిపింది. అక్కడ వారు బస చేసిన హోటల్‌లో ప్రియుడితో సన్నిహితంగా ఉన్న సమయంలో హోటల్ సిబ్బంది రహస్యంగా వీడియో తీశారు. ఇదేమీ తెలియని బాధితురాలు తిరిగొచ్చాక గోవా టూర్ విషయమే మిరిచిపోయింది. ఆ తర్వాత మరో వ్యక్తిని పెళ్లి చేసుకుని గుట్టుగా కాపురం చేసుకుంటోది. అయితే, గోవాలో వారికి బస, ఇతర ఏర్పాట్లు చేసిన యశ్వంత్ (40) అనే వ్యక్తి ఆ మహిళకు ఇటీవల ఫోన్ చేశాడు.
గతంలో మీరు మీ ప్రియుడితో సన్నిహితంగా ఉన్న వీడియోలు తన వద్ద ఉన్నాయని, రూ.30 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. డబ్బు ఇస్తే వాటిని డిలీట్ చేస్తానని లేదంటే ఆన్‌లైన్‌లో పోస్ట్ చేస్తానంటూ బెదిరించాడు. అంత డబ్బు తన వద్ద లేదని, ఆ వీడియోలు బయటపెడితే తన సంసార జీవితం ఛిన్నాభిన్నమైపోతుందన ప్రాధేయపడుతూ ఆ వీడియోలను డిలీట్ చేయాలని కోరింది. అయితే, యశ్వంత్ వినిపించుకోకపోవడంతో పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు.. యశ్వంత్ ఆచూకీ కనుగొనే పనలో నిమగ్నమయ్యారు.