Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మొన్నటికి మొన్న శివలింగాన్ని చుట్టిన నాగయ్య.. ఇప్పుడేమో నాగదేవతపై నాగుపాము (video)

Advertiesment
Cobra

సెల్వి

, మంగళవారం, 30 జులై 2024 (22:26 IST)
Cobra
మొన్నటికి మొన్న శ్రీశైలంలోని స్వయంభు లింగం మెడలో ఆదిశేషుడు చుట్టుకున్నట్లు నాగుపాము కనిపించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ప్రస్తుతం నాగదేవత తలపై నాగపాము పడగవిప్పిన అరుదైన దృశ్యానికి సంబంధించిన వీడియో నెట్టింటిని షేక్ చేస్తోంది. 
 
ఈ వీడియోను చూసిన భక్తులు ఇది శుభసూచకమని అంటున్నారు. శ్రీశైలం స్వయంభు లింగాన్ని చుట్టడం.. ప్రస్తుతం నాగ దేవతపై నాగుపాము కనిపించడం తెలుగు రాష్ట్రాలకు మంచి జరిగేందుకేనని భక్తులు నమ్ముతున్నారు. 
 
ఇక నాగదేవతపై నాగుపాము కనిపించిన దృశ్యం పెద్దపల్లి జిల్లా ఓదెలలో శంభు లింగేశ్వర స్వామి దేవాలయంలో చోటుచేసుకుంది. నాగదేవతల విగ్రహంపై నాగుపాము పడగ విప్పింది. 
 
ఈ అద్భుత దృశ్యాన్ని చూసేందుకు భక్తులు ఎగబడ్డారు. ఇంకా ఆమడ దూరంలో నిలిచి ఆ అద్భుత దృశ్యాలను వీడియోల ద్వారా బంధించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో, ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఔరంగాబాద్‌లో 120 ఎకరాల ప్లాట్‌ను కొనుగోలుకి మహారాష్ట్ర ప్రభుత్వంతో లుబ్రిజోల్ అవగాహన ఒప్పందం