Publish Date: Sat, 14 Mar 2026 (09:50 IST)
Updated Date: Sat, 14 Mar 2026 (09:57 IST)
తెలంగాణ వ్యాప్తంగా పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభం అయ్యాయి. శనివారం ఉదయం 9.30 గంటలకు ప్రారంభమయ్యాయి. పరీక్ష ప్రారంభ సమయానికి మరో 5 నిమిషాలు అదనంగా అంటే ఉదయం 9.35 గంటల వరకు విద్యార్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించాలని ప్రభుత్వ పరీక్షల విభాగం నిర్ణయించిన విషయం తెలిసిందే.
అయితే విద్యార్థులు చివరి నిమిషంలో ఇబ్బంది పడకుండా ప్రస్తుత వాతావరణ పరిస్థితులు, ట్రాఫిక్ ఇబ్బందుల నేపథ్యంలో విద్యార్థులు ఉదయం 8.30 గంటల వరకు పరీక్షా కేంద్రాలకు చేరుకునేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్(బిఎన్‌ఎస్‌ఎస్ 163) అమలులో ఉంటుంది.
పది పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు 144 ఫ్లైయింగ్ స్కాడ్‌లను నియమించారు. పదో తరగతి పరీక్షా కేంద్రాల్లోకి ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి ఉండదు.
ఈసారి కొత్తగా హాల్‌టికెట్లపై క్యూఆర్ కోడ్ పదవ తరగతి పరీక్షల హాల్‌టికెట్లపై ఈసారి కొత్తగా క్యూఆర్ కోడ్ ముద్రించారు. దాంతో విద్యార్థులు తమ ఇళ్ల నుంచి పరీక్షా కేంద్రం ఎంత దూరంలో ఉంది.. ఎంత సమయం పడుతుందో ముందుగానే తెలుసుకుని అందుకు అనుగుణంగా పరీక్షా కేంద్రానికి వెళ్లవచ్చు.