Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పనిమనిషి టీలో మత్తుమందు కలిపి.. ఆపై మహిళా యజమాని ఏం చేసిందో చూడండి

పనిమనిషి టీలో మత్తుమందు కలిపి.. ఆపై మహిళా యజమాని ఏం చేసిందో చూడండి
, మంగళవారం, 2 ఫిబ్రవరి 2021 (10:23 IST)
ఖమ్మం పట్టణంలో ఓ మహిళ ఇంటికి అతిథులుగా వెళ్లిన వ్యక్తులు ఆ ఇంటి పనిమనిషిపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. అడ్డు చెప్పాల్సిన మహిళా యజమాని ఆ తతంగాన్ని వీడియో తీసింది.

ఖమ్మం పట్టణంలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. టీచర్స్‌ కాలనీకి చెందిన కాల్వ కళావతి ఇంట్లో ఓ మహిళ పనిచేస్తోంది. జనవరి 13న కళావతి ఇంటికి సయ్యద్‌ హుస్సేన్, కాల్వ రామారావు, కాల్వ సుమతి, ఉబ్బన మాణిక్యం అనే వ్యక్తులు వచ్చారు.

ఆ సమయంలో పనిమనిషి పనులన్నీ పూర్తి చేసుకుని తన ఇంటికి వెళ్తుండగా టీ తాగి వెళ్లాలని కళావతి సూచించింది. టీలో అప్పటికే మత్తు మందు కలిపారు. ఆ టీ తాగిన పనిమనిషి వెంటనే స్పృహ తప్పి పడిపోయింది. అపస్మాకర స్థితిలో ఉన్న ఆమెపై సయ్యద్‌ హుస్సేన్‌ అత్యాచారానికి పాల్పడగా కళావతి వీడియో తీసింది.
 
కాసేపటి తర్వాత తేరుకున్న బాధితురాలు తనపై జరిగిన దారుణం తెలుసుకుని కుమిలిపోయింది. ఈ విషయాన్ని బయటకు చెబితే వీడియో ఇంటర్నెట్‌లో పెడతానని బాధితురాలిని కళావతి బెదిరించింది. దీంతో పాటు రూ.5లక్షలివ్వాలంటూ బెదిరిస్తోంది.

దీంతో విసిగిపోయిన బాధితురాలు ఖమ్మం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఐదుగురిపై కేసు నమోదు చేశారు. మహిళపై అత్యాచారానికి పాల్పడిన సయ్యద్ హుస్సేన్‌‌ను అదుపులోకి తీసుకోగా.. మిగిలిన నలుగురు పరారీలో ఉన్నారు.
 
ఈ కేసులో నిందితురాలైన కళావతి గతంలోనూ ఓ వ్యాపారికి వలపు వల వేసి బెదిరించినట్లు పోలీసులు చెబుతున్నారు. మార్కెట్‌ ఏరియాకు చెందిన వ్యాపారికి వలపు వల వేసి బెదిరించినట్లు పోలీసులు చెబుతున్నారు.

మార్కెట్‌ ఏరియాకు చెందిన వ్యాపారితో శారీరక సంబంధం పెట్టుకుని, ఏకాంత సమయంలో అతడికి తెలియకుండా వీడియోలు తీసి రూ.10లక్షలు డిమాండ్ చేసింది. అడిగినంత డబ్బు ఇవ్వకపోతే ఆ వీడియోలు సోషల్‌మీడియాలో పోస్ట్ చేస్తానని బ్లాక్‌మెయిల్ చేసింది.

ఆ వ్యాపారి ఫిర్యాదుతో గతేడాది సెప్టెంబర్ నెలలో కళావతిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆమె వలలో పట్టణానికి చెందిన మరికొందరు కూడా చిక్కుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ కిలేడీ కాల్‌డేటా సేకరించిన పోలీసులు ఈ కేసును లోతుగా దర్యాప్తు చేస్తున్నారు

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కేంద్ర బడ్జెట్.. హైదరాబాదులో భారీగా తగ్గిన పసిడి ధరలు