Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'నీతి ఆయోగ్' పాలక మండలి సమావేశం... కేసీఆర్‌కు మోడీ పిలుపు..!

Advertiesment
niti aayog
ప్రణాళిక సంఘానికి బదులుగా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన 'నీతి ఆయోగ్' పాలకమండలి తొలి సమావేశాలకు హాజరుకావాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి కె.చంద్రశేఖర్ రావుకు దేశ ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన ఒక లేఖను కేసీఆర్‌కు పంపించారు. 
 
కొత్తగా ఏర్పాటు చేసిన 'నీతి ఆయోగ్' తొలి పాలక మండలి సమావేశాలు ఫిబ్రవరి 28వ తేదిన జరగనున్నాయి. ఢిల్లీకి వచ్చి ఈ సమావేశాల్లో పాల్గొనాలని కేసీఆర్‌ను మోడీ ఆహ్వానించారు. కాగా ఇదే విధంగా దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్య మంత్రులను ఆహ్వానిస్తూ మోడీ లేఖలు పంపించారు.

Share this Story:

Follow Webdunia telugu