Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కేసీఆర్‌ ఇమేజ్‌ను దారుణంగా దెబ్బతీసిన కోదండరామ్ అరెస్టు

నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోసం భారీ ర్యాలీకి పిలుపునిచ్చిన టీజేఎసీ చై్ర్మన్ ప్రొఫెసర్ ఎం. కోదండరామ్‌ను బుధవారం తెల్లవారుజూమున ఇంటి తలుపులు బద్దలు కొట్టి, లాగి అరెస్టు చేయడంతో తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావుకు పెద్ద ఉపశమనం కలిగించి ఉండవచ్చు.

కేసీఆర్‌ ఇమేజ్‌ను దారుణంగా దెబ్బతీసిన కోదండరామ్ అరెస్టు
హైదరాబాద్ , గురువారం, 23 ఫిబ్రవరి 2017 (07:43 IST)
నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోసం భారీ ర్యాలీకి పిలుపునిచ్చిన టీజేఎసీ చై్ర్మన్ ప్రొఫెసర్ ఎం. కోదండరామ్‌ను బుధవారం తెల్లవారుజూమున ఇంటి తలుపులు బద్దలు కొట్టి, లాగి అరెస్టు చేయడంతో తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావుకు పెద్ద ఉపశమనం కలిగించి ఉండవచ్చు. కానీ తనను విమర్శిస్తున్న వారికి ప్రజాస్వామికంగా ఆందోళనలు చేసే హక్కును భగ్నం చేసినందుకు గాను కేసీఆర్ ప్రతిష్ట దారుణంగా దెబ్బతినిందని విమర్శకులు అంటున్నారు. 
 
హైదరాబాద్ ఈస్ట్ జోన్ డీసీపీ వి రవీందర్ హైదరాబాద్ లోని తార్నార ఏరియాలో ఉన్న కోదండరామ్ ఇంటికి బుధవారం తెల్లవారు జాముల 3 గంటలకు వందలాది పోలీసులతో వెళ్లి ఇంటి తలుపులు బద్దలు గొట్టి మరీ బలవంతంగా బయటకి లాగి ముందస్తు కస్టడీలోకి తీసుకోవడం కేసీఆర్ ప్రభుత్వ పచ్చి నిరంకుశ వైఖరినే ప్రదర్శిస్తోందని పరిశీలకులు చెబుతున్నారు. 
 
బుధవారం ఉదయం నుంచి సోషల్ మీడియాలో కేసీఆర్ ఫెయిల్డ్ తెలంగాణ అనే హాష్ ట్యాగ్ విపరీతంగా ట్రెండ్ అయింది. యువతలో పేరుకుపోయిన కేసీఆర్ వ్యతిరేక దోరణిని ఇది ప్రదర్సిస్తోంది. చివరకు కేసీఆర్‌ను పూర్తిగా  బలపర్చి విశ్వసనీయులు సైతం కోదండరామ్ అరెస్టును ఖండిస్తున్నారు. కోదండరామ్ తలపెట్టిన నిరుద్యోగుల ర్యాలీని అనుమతించి ఉంటేనే బాగుండేదని వీరు చెబుతున్నారు. 
 
ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరునోరు విప్పినా తీవ్ర ఇబ్బందులు ఎదిుర్కొంటారని ప్రభుత్వం హెచ్చరించడానికే కేసీఆర్ ప్రబుత్వం ఇంతకు దిగజారిందని ప్రజలు భావిస్తున్నారు. గతంలోని ఆంధ్ర ప్రభుత్వానికి, ప్రస్తుత కేసీఆర్ ప్రభుత్వానికి ఏమాత్రం తేడాలేదని, ప్రజాస్వామిక ఆందోళనలపై ఉక్కుపాదం మోపడంలో దొందూ దొందేనని ప్రజలు భావిస్తున్నారు. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కేసీఆర్‌ పైకి మాత్రమే భక్తుడు.. లోపల నరహంతకుడు: నారాయణ.. నారాయణ