తెలంగాణా రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉంది. ఇప్పటికే సోషల్ మీడియా ప్రచారంపై నిఘా పెట్టిన ఎన్నికల అధికారులు పోలింగ్‌కు ముందు 48 గంటల సైలెన్స్ పిరియడ్‌లో రాజకీయపరమైన ఎస్ఎంఎస్, బల్క్ ఎస్ఎంఎస్‌లను పంపరాదని ఎన్నికల అధికారులు తెలిపారు.
ఒకవేళ అభ్యంతరమైన ఎస్ఎంఎస్‌లను పంపినట్లయితే వారిపై విచారణ జరిపి భారత శిక్ష స్మృతి (ఐపీసీ) ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951, ఎన్నికల ప్రవర్తన నియమావళి 1961 ప్రకారం పంపిన వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.
సాధారణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు 48 గంటల ముందు అంటే.. నవంబర్ 28వ తేదీ సాయంత్రం 5.00 గంటల నుండి 30వ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు సైలెన్స్ పిరియడ్‌లో రాజకీయపరమైన ఎస్ఎంఎస్, బల్క్ ఎస్ఎంఎస్ ప్రసారాలను నిలుపుదల చేయవలసిందిగా ఎన్నికల కమిషన్ ఆదేశించింది.