Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సుహాసిని ఎంపిక వెనుకు చంద్రబాబు వ్యూహం ఇదేనా?

Advertiesment
సుహాసిని ఎంపిక వెనుకు చంద్రబాబు వ్యూహం ఇదేనా?
, శుక్రవారం, 30 నవంబరు 2018 (20:16 IST)
కూకట్‌పల్లి నుంచి నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసిని బరిలోకి దింపడం ద్వారా సీఎం చంద్రబాబు వ్యూహాత్మకంగా ప్రత్యర్థులను డిఫెన్స్‌లోకి పడేశారు. సుహాసిని అభ్యర్థిత్వాన్ని ప్రకటించడంతో పురందేశ్వరి మినహా ఎన్టీఆర్ కుటుంబమంతా ఏకతాటిపైనే ఉన్నారనే సంకేతాలను టీడీపీ ఇచ్చినట్లయింది. అంతేకాదు హరికృష్ణను కోల్పోయిన కుటుంబానికి అండగా ఉన్నామని భరోసా ఇచ్చినట్లయింది. 
 
కాంగ్రెస్‌తో టీడీపీ కలిసిందన్న విమర్శలకు సెంటిమెంట్‌తో సమాధానం చెప్పడంతో పాటు, నందమూరి కుటుంబ సభ్యులను ప్రచారంలోకి దింపాలని నిర్ణయించారు. 
2009 ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ తరుపున ప్రచారం నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఎన్నికల్లో కూడా గ్రేటర్ పరిధిలో మహాకూటమి విజయానికి దోహదపడాలంటే సుహాసినిని అభ్యర్ధిగా ప్రకటిస్తే అన్ని స్ధానాలపై ప్రభావం ఉంటుందని టీడీపీ భావిస్తోంది. అంతేకాకుండా మిగతా అభ్యర్ధులకు కూడా సుహాసిని బరిలోకి దిగడం కలిసివస్తుందని టీడీపీ అంచనా వేస్తోంది. 
 
మరోవైపు మహాకూటమి తరపున బాలకృష్ణ కూడా ప్రచారం నిర్వహిస్తారని టీటీడీపీ నేత ఎల్. రమణ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈమెను రంగంలోకి దింపడం ద్వారా జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రాం మద్దతు ఉంటుందని టీడీపీ ఆశిస్తోంది.
 
గతంలో హరికృష్ణ కూడా టీడీపీ నుంచి ఎంపీగా, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా పనిచేశారు. ఆయన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన తర్వాత ఆ కుటుంబానికి న్యాయం చేయాలని చంద్రబాబు భావించారు. దీంతో సుహాసిని అభ్యర్థిత్వాన్ని ఖారారు చేశారని టీడీపీ నేతలు చెబుతున్నారు. 
 
కూకట్‌పల్లి నుంచి టికెట్ ఆశించిన ఆశావాహులతో చంద్రబాబు సమావేశం కానున్నారు. ఈ భేటీలో సుహాసినికి మద్దతు ఇవ్వాలని కోరనున్నారు. కూకట్‌పల్లి టికెట్‌ను పెద్దిరెడ్డి, మందాడి శ్రీనివాస్‌ ఆశించారు. వీరితో కూడా చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశమవుతారని తెలుస్తోంది. అయితే సుహాసిని కూకట్‌పల్లి అభ్యర్థిగా ప్రకటించడంతో హరికృష్ణ కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. గతంలో ఎన్టీఆర్ ఉమ్మడి వరంగల్ జిల్లా పాలకుర్తి నుంచి ప్రాతినిధ్యం వహించారు. అలాగే నల్గొండ నుంచి కూడా ప్రాతినిధ్యం వహించారు. తర్వాత నందమూరి కుటుంబం నుంచి తెలంగాణలో ప్రాతినిధ్యం వహించిన దాఖలాలు లేవు. అయితే ఆయన మనవరాలు సుహాసిని తెలంగాణ నుంచి రెండోసారి ప్రాతినిధ్యం వహించబోతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జేపిపై చిర్రుబుర్రులాడిని జెడి లక్ష్మీనారాయణ.. ఎందుకు..?