Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రిటైర్మెంట్ వయుసు 61 యేళ్లు... వృద్ధాప్య పెన్షన్ అర్హత వయసు 57.. తెరాస మేనిఫెస్టో

Advertiesment
రిటైర్మెంట్ వయుసు 61 యేళ్లు... వృద్ధాప్య పెన్షన్ అర్హత వయసు 57.. తెరాస మేనిఫెస్టో
, సోమవారం, 3 డిశెంబరు 2018 (09:43 IST)
తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) మరో మేనిఫెస్టోను విడుదల చేసింది. ఈనెల ఏడో తేదీన జరుగనున్న తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికల కోసం ఓటర్లను ఆకర్షించేందుకు ఈ మేనిఫెస్టోను ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఆదివారం విడుదల చేసింది. ఇందులో అనేక ఆకర్షణీయమైన పథకాలను ప్రకటించారు. ముఖ్యంగా, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును 58 యేళ్ల నుంచి 61 యేళ్లకు పెంచుతామని పేర్కొంది. అలాగే, వృద్ధాప్య పెన్షన్లు పొందేందుకు అర్హత వయసును 65 యేళ్ళ నుంచి 57 యేళ్ళకు తగ్గిస్తామని తెలిపింది. ఈ మేనిఫెస్టోలోని పలు ముఖ్యమైన హామీలను పరిశీలిస్తే, 
 
* అన్నిరకాల ఆసరా పెన్షన్లు రూ.1,000 నుంచి రూ.2,016 వరకు పెంపు. 
* వికలాంగుల పెన్షన్లను రూ.1500 నుంచి రూ.3,016 వరకు పెంపు. 
* బీడి కార్మికుల‌ పీఎఫ్‌ క‌టాఫ్‌ డేట్‌ను 2018 వరకు పొడగింపు. 
* వృద్దాప్య పెన్షన్ అర్హత వయసును 65 యేళ్ళ నుంచి 57 యేళ్ళకు తగ్గింపు. 
* నిరుద్యోగ భృతి నెలకు రూ.3016. 
* సొంతస్థలం ఉన్నఅర్హులైన పేదలకు డబుల్ బెడ్రూం ఇంటి నిర్మాణం కోసం రూ.5 లక్షల నుంచి రూ.6 లక్షల నిధి. 
* రైతుబంధు కింద ఏడాదికి ఎకరాకు అందిస్తున్న సాయాన్ని 8 వేల నుంచి 10వేల రూపాయలకు పెంపు. 
* రైతులకు రూ.లక్ష లోపు పంట రుణాలు మాఫీ. 
* ఎస్సీ, ఎస్టీ వర్గాల సమగ్ర అభివృద్ధి కోసం ప్రత్యేక పథకాలు రూపొందించేందుకు నియమించిన కమిటీ ఇచ్చే నివేదికను ప్రభుత్వం అమలు చేస్తుంది.
* చట్టసభల్లో బిసిలకు 33 శాతం, మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలు కోసం పోరాటం. 
* ఎస్టీలకు 12 శాతం, మైనారిటీలకు 12 శాతం రిజర్వేషన్ల కోసం కృషి. 
* ఎస్సీ వర్గీకరణ కోసం చర్యలు.. అసెంబ్లీ తీర్మానం. 
* రెడ్డి కార్పొరేషన్, వైశ్య కార్పొరేషన్‌తో పాటు ఆర్థికంగా వెనుకబడిన ఇతర వర్గాల సంక్షేమం కోసం కార్పొరేషన్లు ఏర్పాటు. 
* కంటి వెలుగు పథకం తరహాలోనే ప్రజలందరికీ ఇతర ఆరోగ్య పరీక్షల కోసం రాష్ట్ర వ్యాప్తంగా వైద్య శిబిరాలను ఏర్పాటు. 
* ప్రతీ వ్యక్తి హెల్త్ ప్రొఫైల్ రికార్డు చేసి, తెలంగాణ రాష్ట్ర హెల్త్ ప్రొఫైల్ 
* ప్రభుత్వ ఉద్యోగుల‌కు సబబైన, సముచితమైన రీతిలో వేతన సవరణ. 
* ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వ‌య‌సును 58 నుంచి 61 సంవత్సరాలకు పెంపు. 
* బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ స్థాపించడానికి చర్యలు. 
* సింగరేణి భూముల్లో ఇండ్లు కట్టుకున్న వారికి పట్టాలు ఇస్తుంది.
* హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దే ప్రయత్నాలు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నాన్నా చనిపోతున్నా.. ఆ లెక్చరర్‌ను వదలొద్దు : ఢిల్లీలో తెలుగు విద్యార్థి సూసైడ్