Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణం.. మంత్రిగా మహమూద్ అలీ కూడా...

Advertiesment
ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణం.. మంత్రిగా మహమూద్ అలీ కూడా...
, గురువారం, 13 డిశెంబరు 2018 (13:50 IST)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గురువారం ప్రమాణం చేశారు. రాజ్‌భవన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన చేత రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ప్రమాణం చేయించారు. రాష్ట్ర మంత్రిగా మైనార్టీ వర్గానికి చెందిన మహమూద్ అలీ ప్రమాణం చేశారు. 
 
ప్రమాణస్వీకారం అనంతరం సభికులకు సీఎం కేసీఆర్ వినమ్రంగా నమస్కారం చేశారు. ఆ తర్వాత గవర్నర్ నరసింహన్.. రెండోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టిన కేసీఆర్‌కు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. రాజ్‌భవన్‌లో జరిగిన ఈ ప్రమాణస్వీకార కార్యక్రమానికి కేసీఆర్ కుటుంబ సభ్యులు, టీఆర్ఎస్ నాయకులు, కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు హాజరయ్యారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

13 బాలికపై ఆటో డ్రైవర్ స్నేహితుల కన్ను.. కిడ్నాప్ చేసి తీసుకెళ్లి..?