Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కారు దెబ్బకు సైకిల్ తుక్కు తుక్కు... ఏపీలో పచ్చపార్టీ పరిస్థితి మరీ ఘోరం

కారు దెబ్బకు సైకిల్ తుక్కు తుక్కు... ఏపీలో పచ్చపార్టీ పరిస్థితి మరీ ఘోరం
, మంగళవారం, 11 డిశెంబరు 2018 (12:09 IST)
తెలంగాణలో రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్న కల్వకుంట్ల చంద్రశేఖర్ గారికి అభినందలు అంటూ జనసేన కార్యకర్తలు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇందులో భాగంగా సోషల్ మీడియాలో తెరాస నేతలకు అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. బంగారు తెలంగాణని మరింత అభివృద్ధి చేయాలని జనసేన ఆంధ్రా యువత శుభాకాంక్షలు తెలిపింది. 
 
అలాగే జనసేనాని పవన్ కల్యాణ్‌కు టీఆర్ఎస్ కార్యకర్తలు కృతజ్ఞతలు చెప్తున్నారు. తెలంగాణలో ఏపీ సీఎం చంద్రబాబు అడుగుపెట్టిన తర్వాతే ప్రజా కూటమికి చుక్కలు కనిపించాయని.. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఒంటరి పోరాటం చేసి వుంటే 35 సీట్లు వచ్చేవేమోనని జనసేన కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. ఇంకా చంద్రబాబు సార్ రాకతో యుద్ధం ఈజీగా ముగిసిందని జనసేన కార్యకర్తలు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. కారు దెబ్బకు సైకిల్ తుక్కు తుక్కు అయ్యిందని జనసేన పార్టీ కార్యకర్తలు ఎద్దేవా చేస్తున్నారు. 
 
ఇంకా తెలంగాణ ఎన్నికల ఫలితాలపై లగడపాటి జోస్యం నుంచి ఏపీ ప్రజలకు ఊరట లభించిందని జనసేన కమ్యూనిటీ సోషల్ మీడియాలో పేర్కొంది. చంద్రబాబు మహామాయలో ఇరుక్కుని రాజకీయ జ్యోతిష్య ఉద్యోగం నుంచి ఇంత త్వరగా తప్పుకోవాల్సి వస్తుందని లగడపాటి ఊహించి వుండరని జనసేన కార్యకర్తలు విమర్శిస్తున్నారు.
 
కాంగ్రెస్‌తో కలిసి టీడీపీని తెలంగాణ ప్రజలు పాతాళంలోకి పంపించారని.. జనబలమున్న బాహుబలి పవన్ కల్యాణ్ మద్దతుతోనే ఏపీలో టీడీపీ ప్రభుత్వాన్ని స్థాపించగలిగిందని.. తెలంగాణ కంటే ఏపీలో పచ్చపార్టీ పరిస్థితి మరీ ఘోరమని జనసేన నేతలు మండిపడ్డారు. అంతేగాకుండా 2019లో జనసేన పార్టీ ఏపీలో బలంగా రుజువు కాబోతోందని జనసేన కార్యకర్తలు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. 
 
2019 ఏపీ ఎన్నికలకు తెలంగాణ ఎన్నికలు సెమీఫైనల్ లాంటివేనని.. తప్పకుండా ఆ ఎన్నికల్లో జనసేన పార్టీ గెలుపును నమోదు చేసుకుంటుందని.. పవన్ కల్యాణ్ సీఎం కావడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు జోస్యం చెప్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రజా కూటమిపై #PSPK ఫ్యాన్స్ సెటైర్స్... మొదలైన మీమ్స్...