Article Sweets Dishes %e0%b0%ac%e0%b0%be%e0%b0%a6%e0%b0%82 %e0%b0%aa%e0%b0%be%e0%b0%af%e0%b0%b8%e0%b0%82 108072100071_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బాదం పాయసం

Advertiesment
బాదం పాయసం పప్పు తొక్కు ఒకగంట పంచదార ఏలక్కాయలు జీడిపప్పు సారా పప్పు పిస్తాపప్పు
WD PhotoWD
కావలసిన పదార్థాలు :
నెయ్యి... నాలుగు స్పూన్లు
బాదం పప్పు.. 250 గ్రాములు
పంచదార... 250 గ్రాములు
పాలు... అర లీటర్
ఏలక్కాయలు, జీడిపప్పు, సార పప్పు, పిస్తాపప్పు... చెరో పది గ్రాములు
కుంకుమ పువ్వు, లేదా కేసరి పౌడర్... రెండు టీ స్పూన్లు

తయారీ విధానం :
బాదంపప్పును వేడి నీటిలో నానబెట్టాలి. ఒకగంట తర్వాత బాదంపప్పుపై గల తొక్కును తీసుకొని మెత్తగా రుబ్బుకోవాలి. రుబ్బుకున్న ముద్దకు 3/4 మోతాదులో నీటిని చేర్చుకుని పచ్చివాసన పోయేవరకు మరగనివ్వాలి. తర్వాత అందులో పంచదార, నేతిలో వేయించిన జీడిపప్పు, సార, పిస్తా పప్పులను కలుపుకోవాలి.

కలర్‌కోసం కేసరి పౌడర్, ఏలకులను కూడా చేర్చుకోవాలి. అంతే వేడివేడి బాదం పాయసం రెడీ. ఈ పాయసాన్ని వేడిగానైనా తినవచ్చు లేదా చల్లగా తినాలకునేవారు ఇరవై నిముషాలపాటు ఫ్రిజ్‌లో ఉంచి ఆ తర్వాత తినవచ్చు.

Share this Story:

Follow Webdunia telugu