Article Sweets Dishes %e0%b0%aa%e0%b1%86%e0%b0%b8%e0%b0%b0 %e0%b0%aa%e0%b0%aa%e0%b1%8d%e0%b0%aa%e0%b1%81%e0%b0%a4%e0%b1%8b %e0%b0%b2%e0%b0%a1%e0%b1%8d%e0%b0%a1%e0%b1%82%e0%b0%b2%e0%b1%81 108081400049_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పెసర పప్పుతో లడ్డూలు

Advertiesment
వంటకాలు స్వీట్లు పెసరపప్పు పంచదార నెయ్యి జీడిపప్పు యాలకుల పొడి పచ్చకర్పూరం నీళ్లు ఫుడ్ కలర్
FileFILE
కావలసిన పదార్థాలు :
చాయపెసర పప్పు... ఒక కేజీ
పంచదార... ఒకటింపావు కిలో
నెయ్యి... 400 గ్రాములు
జీడి పప్పు... 50 గ్రాములు
యాలకుల పొడి... సరిపడా
పచ్చ కర్పూరం... చిటికెడు
లెమన్ ఫుడ్ కలర్... అర టీస్పూను
నీళ్లు... సరిపడా

తయారీ విధానం :
ముందుగా పెసర పప్పును మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసి పెట్టుకోవాలి. స్టవ్‌పై ఒక గిన్నె పెట్టి అందులో పంచదార వేసి సరిపడా నీళ్లుపోసి ఫుడ్ కలర్, పచ్చకర్పూరం, యాలకుల పొడిని కలపి తీగ పాకం వచ్చే వరకూ కలియబెట్టాలి.

ఆ తరువాత పెసరపొడి, కొంచెం కొంచెంగా నేయిని జతచేస్తూ బాగా కలిపి దించాలి. గోరు వెచ్చగా ఉన్నప్పుడు ఓ మోస్తరు సైజులో ముద్దలుగా తీసుకుని ఒక్కో ముద్దపైన ఒక్కొక్క జీడి పప్పు పెట్టి లడ్డూలుగా చేసుకోవాలి. అంతే రుచికరమైన పెసరలడ్డూలు రెడీ.

Share this Story:

Follow Webdunia telugu