Article Sweets Dishes %e0%b0%95%e0%b1%8b%e0%b0%b5%e0%b0%be %e0%b0%95%e0%b1%87%e0%b0%b8%e0%b0%b0%e0%b1%8d %e0%b0%96%e0%b1%88%e0%b0%a8%e0%b1%8d 108100900051_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కోవా కేసర్ ఖైన్

Advertiesment
వంటకాలు కోవా కేసర్ ఖైన్ పాలు చక్కెర లీటర్లు కేసరి కుంకుమపువ్వు గ్రాము బాదంపప్పు సెగ ట్రే ఫ్యాన్ గాలి వేడి గుండ్రం
FileFILE
కావలసిన వస్తువులు :
పాలు... 5 లీటర్లు
చక్కెర... 600 గ్రాములు
కేసరి (కుంకుమపువ్వు)... 3 గ్రాములు
బాదంపప్పు... 100 గ్రాములు

తయారీ విధానం :
పాలు బాగా చిక్కబడేంతవరకు సన్నని సెగపై మరిగించి.. చిక్కబడుతుండగా చక్కెర వేసి కాసేపటి తరువాత... ఒక ట్రేలో పోయాలి. ఈ మిశ్రమాన్ని ఫ్యాను గాలికింద ఆరబెట్టి కోవాను సిద్ధం చేసుకోవాలి. కోవా గట్టిపడ్డ తర్వాత దానిని రెండు భాగాలుగా చేసుకోవాలి. ఒక భాగం కోవాలో కుంకుమపువ్వు వేసి, కొంచెం వేడిపాలు పోయాలి. దానిని అలాగే పది నిముషాలసేపు నాననివ్వాలి.

మిగిలిన కోవాలో కొద్ది కొద్దిగా తీసుకుని, రోల్స్‌లాగా చేసి ఒక్కో రోల్ మధ్యలో కుంకుమపువ్వు వేసిన కోవాను పెట్టి మళ్ళీ గుండ్రంగా చుట్టాలి. అలా మొత్తం చేసుకున్న తరువాత ఒక్కోదానిపైన, ఒక్కో బాదంపప్పును అతికించాలి. అంతే కోవా కేసర్ ఖైన్ రెడీ అయినట్లే...! మీరూ ప్రయత్నిస్తారు కదూ...!

Share this Story:

Follow Webdunia telugu