Article Sweets Dishes %e0%b0%95%e0%b1%8a%e0%b0%ac%e0%b1%8d%e0%b0%ac%e0%b0%b0%e0%b0%bf%e0%b0%a4%e0%b1%8b %e0%b0%ae%e0%b1%88%e0%b0%b8%e0%b1%82%e0%b0%b0%e0%b1%8d %e0%b0%aa%e0%b0%be%e0%b0%95%e0%b1%8d 108080200032_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కొబ్బరితో మైసూర్ పాక్

Advertiesment
వంటకాలు స్వీట్లు కొబ్బరి బాగా చిన్న ముక్కలు చిప్ప కోరకూడదు జీడిపప్పు
FileFILE
కావలసిన పదార్థాలు :
చక్కెర... 700 గ్రాములు
సెనగ పిండి... 100 గ్రాములు
ముదురు కొబ్బరికాయ... ఒకటి
జీడిపప్పు... 70 గ్రాములు
కేసరిపొడి... తగినంత
ఏలక్కాయ... 7 లేక 8
నెయ్యి... 150 లేదా 200 గ్రాములు

తయారీ విధానం :
కొబ్బరి చిప్పని కోరకుండా, బాగా చిన్న ముక్కలుగా చేసుకోవాలి. జీడిపప్పుని బద్దలు చేసుకుని నెయ్యిలో వేయించి ప్రక్కన పెట్టుకోవాలి. తరువాత 1/4 లీటరు నీళ్లలో చక్కెర కలిపి పొయ్యి మీద పెట్టి చిక్కగా చేసుకోవాలి. ఈ చక్కెర పాకం మరుగుతూ ఉన్నప్పుడు కొబ్బరి ముక్కలు కలిపి, తిప్పుతూ వుండాలి. చిక్కబడుతూ ఉన్నప్పుడు సెనగపిండిని కొంచెం కొంచెంగా చేర్చి బాగా కలుపుతూ ఉండాలి. తరువాత వేయించిన జీడిపప్పు, కేసరిపొడి కలపాలి.

అందులో రెండు లేక మూడు భాగాలుగా నెయ్యిని వేసి, బాగా గరిటతో కలపాలి. ఇది పొంగుతున్నప్పుడు, ఏలక్కాయపొడి కలిపి, దించేసి నెయ్యి రాసిన పళ్ళెంలో పోయాలి. అరటి ఆకుతో పైన అంతా సమానంగా చెసి, చల్లారిన తరువాత కావలసిన సైజులో ముక్కలుగా కోసుకోవాలి. (ఇది మామూలు మైసూర్ పాక్‌‌లా అంత ఎక్కువగా పొంగదు, నురగరాదు. మరుగుతున్నప్పుడే వెంటనే పొయ్యిమీద నుంచి దించాలి.

Share this Story:

Follow Webdunia telugu