Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మైదా రసగుల్లా ఎలా చేయాలో తెలుసా?

Advertiesment
మైదా రసగుల్లా ఎలా చేయాలో తెలుసా?
, గురువారం, 20 డిశెంబరు 2018 (10:48 IST)
కావలసిన పదార్థాలు:
మైదాపిండి - 1/4 కేజీ
పాలు - 1 కప్పు
యాలకుల పొడి - అరస్పూన్
పంచదార - అరకిలో
కేసరి రంగు - కొద్దిగా
నెయ్యి - 100 గ్రా
 
తయారీ విధానం:
ముందుగా మైదా పిండికి నూనె కలిపి మెత్తగా వత్తుకుని అరగంట పాటు అలానే ఉంచాలి. ఆ తరువాత స్టౌమీద బాణలి వేడయ్యాక నెయ్యి  వేసి అది బాగా వేడయ్యాక అందులో మనం ముందుగా తయారుచేసుకున్న మైదా మిశ్రమాన్ని చిన్న సైజులో పూరీల్లా వత్తుకోవాలి.

ఇలా వేసిన తరువాత మైదా పూరీలు బ్రౌన్ రంగు వచ్చేంత వరకు వేయించి ఓ పాత్రలోకి తీసుకోవాలి. ఈలోగా పంచదార మునిగేవరకు నీటిని పోసి అందులో యాలకుల పొడి, కేసరి రంగు కలిపి వేయించిన పూరీలను పాకంలో కలుపుకోవాలి. ఈ పూరీలను పంచదార జీరాలో కాసేపు ఊరనిస్తే మైదా రసగుల్లా రెడీ.. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఈ వేలిని చూసి గుండెపోటు వస్తుందో రాదో చెప్పొచ్చట..?