Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వంకాయతో బజ్జీలా.. ఎలా చేయాలో చూద్దాం..?

Advertiesment
వంకాయతో బజ్జీలా.. ఎలా చేయాలో చూద్దాం..?
, శనివారం, 15 డిశెంబరు 2018 (11:09 IST)
కావలసిన పదార్థాలు:
పొడవు వంకాయలు - 5 
ఉప్పు - సరిపడా
కారం - సరిపడా
శెనగపిండి - 5 స్పూన్స్
వంటసోడా - అరస్పూన్
గరంమసాలా - 1 స్పూన్
జీలకర్ర పొడి - 1 స్పూన్
ధనియాల పొడి - 1 స్పూన్
నూనె - తగినంత
బియ్యం పిండి - 2 స్పూన్స్
 
తయారీ విధానం:
ముందుగా వంకాయలను మధ్యగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్‌లో స్పూన్ ఉప్పు, కారం, గరంమసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి బాగా కలుపుకుని కట్ చేసుకున్న వంకాయలను ఈ మిశ్రమాన్ని మధ్యలో రాయాలి. ఆ తరువాత మరో బౌల్‌లో శెనగపిండి, బియ్యం పిండి, ఉప్పు, కారం, వంటసోడా వేసి, నీరు పోసి బజ్జీ పిండిలా కలుపుకోవాలి. ఇప్పుడు బాణలిలో నూనె పోసి వేడయ్యాక ఈ బజ్జీ మిశ్రమంలో వంకాయలను డిప్ చేసి నూనెలో వేయించుకోవాలి. అంతే... వంకాయ బజ్జీలు రెడీ. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గర్భిణులు మెుక్కజొన్న సేవిస్తే..?