Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కాబ్రాల్ ఎంత వారించినా వినలేదు.. కండోమ్ తీసి రెండు సార్లు రేప్ చేశాడు: బాధితురాలు

మహిళలపై... ముఖ్యంగా క్రీడాకారుల్లో కొంతమంది పశు వాంఛను ప్రదర్శించడం ఇటీవలి కాలంలో ఎక్కువయినట్లు పలు వార్తలను చూస్తే అర్థమవుతోంది. ఈమధ్యనే విండీస్ బౌలర్ ఒకరు తను సుమారు 5 వేల మంది అమ్మాయిలతో పడక సుఖం చవిచూశానంటూ ప్రకటించి వార్తల్లో నిలిచాడు.

కాబ్రాల్ ఎంత వారించినా వినలేదు.. కండోమ్ తీసి రెండు సార్లు రేప్ చేశాడు: బాధితురాలు
, మంగళవారం, 26 ఏప్రియల్ 2016 (16:23 IST)
మహిళలపై... ముఖ్యంగా క్రీడాకారుల్లో కొంతమంది పశు వాంఛను ప్రదర్శించడం ఇటీవలి కాలంలో ఎక్కువయినట్లు పలు వార్తలను చూస్తే అర్థమవుతోంది. ఈమధ్యనే విండీస్ బౌలర్ ఒకరు తను సుమారు 5 వేల మంది అమ్మాయిలతో పడక సుఖం చవిచూశానంటూ ప్రకటించి వార్తల్లో నిలిచాడు. ఇట్లాంటి సంఘటనలు చెప్పుకోవడం చూస్తే తనదే ఘనకార్యం చేశానని అతడు అనుకుంటున్నట్లు తెలుస్తుంది. అలా ప్రకటించిన వ్యక్తిపై చట్టం ఎలాంటి చర్య తీసుకోకపోవడం గమనార్హం. ఇదిలావుంటే తాజాగా మరో క్రీడాకారుడు ఓ యువతిపై అత్యాచారం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.
 
సుందర్ లాండ్ మాజీ ఫుట్ బాల్ ప్లేయర్ కాబ్రాల్‌ ఆటాడటంలోనే కాదు... కామాంధుడిగా కూడా వార్తల్లోకి ఎక్కాడు. అతడిపై ఓ యువతి తనపై అత్యాచారం చేశాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కోర్టు ఎదుట ఆమె ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం... రాత్రివేళ మందు పార్టీకి అని తనను పిలిచిన కాబ్రాల్, తన స్నేహితురాళ్లకు బాగా మందు తాగించి వారంతా మత్తులో జోగుతుండగా తనపై అత్యాచారం జరిపాడని పేర్కొంది. తనపై అత్యాచారం చేయవద్దని ఎంత మొత్తుకున్నా కండోమ్ తీసి తనపై అఘాయిత్యానికి పాల్పడ్డాడని తెలిపింది. తనపై అత్యాచారం జరుగుతున్న సమయంలో కేకలు వేసినా తన స్నేహితులు ఎవరూ ఆలకించలేకపోయారనీ, వారంతా మత్తులో జోగారని పేర్కొంది. కాగా కాబ్రాల్ మాత్రం అదంతా అవాస్తవం అని కొట్టిపారేస్తున్నాడు. 
 
కానీ బాధితురాలు మాత్రం ఆరోజు ఏం జరిగిందో పూసగుచ్చినట్లు కోర్టు ముందు చెప్పింది. ఆ రోజు తను తప్ప తన స్నేహితురాళ్లంతా మద్యం తాగారనీ, క్లబ్బులో బాగా డాన్స్ చేసి అలసిపోయిన అనంతరం తమను ఓ ప్రైవేటు నివాసానికి తీసుకెళ్లినట్లు తెలిపింది. అక్కడ కాబ్రాల్ తన స్నేహితురాళ్లకు మళ్లీ మందు తాగించి వారంతా మత్తులోకి జారుకోగానే తనపై అత్యాచారానికి ఒడిగట్టినట్లు పేర్కొంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దక్షిణాఫ్రికాలో అంతర్జాతీయ మ్యాచ్‌లపై నిషేధం: బోర్డు