Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

దక్షిణాఫ్రికాలో అంతర్జాతీయ మ్యాచ్‌లపై నిషేధం: బోర్డు

దక్షిణాఫ్రికాలో అంతర్జాతీయ మ్యాచ్‌లపై నిషేధం: బోర్డు
, మంగళవారం, 26 ఏప్రియల్ 2016 (09:35 IST)
దక్షిణాఫ్రికాలో ఏడాది పాటు క్రికెట్.. రగ్బీ అంతర్జాతీయ మ్యాచులేవీ నిర్వహించకుండా నిషేధం విధించింది. ఈ రెండు క్రీడల్లో జాతి వివక్ష నడుస్తుండటమే ఈ నిర్ణయానికి కారణమని దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు వెల్లడించింది. క్రికెట్ రగ్బీ క్రీడల్లో నల్లజాతీయులకు అవకాశమివ్వకుండా.. తెల్ల జాతీయులకే పెద్ద పీట వేస్తుండటంతో దక్షిణాఫ్రికా క్రీడామంత్రి ఫికిలి ఎంబాలులా ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారు. 
 
ఏడాది పాటు దక్షిణాఫ్రికాలో టోర్నమెంట్లు.. మేజర్ మ్యాచ్‌లు ఏవీ నిర్వహించకుండా నిషేధం విధించారు. నల్లజాతీయులను ప్రోత్సహించడంలో ఒక్క ఫుట్బాల్ క్రీడ మాత్రమే ముందున్నదని.. కాబట్టి ఆ ఆటకు నిషేధం వర్తించబోదని ఆయన తెలిపారు. దక్షిణాఫ్రికా క్రికెట్లో జాతి వివక్ష ఆరోపణలు ఈనాటివి కావనే విషయం తెలిసిందే.

Share this Story:

Follow Webdunia telugu