Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పారిస్ ఒలింపిక్స్ : భారత్ ఖాతాలో మరో పతకం ఖాయం!!

vinesh phogat

వరుణ్

, బుధవారం, 7 ఆగస్టు 2024 (09:54 IST)
పారిస్ వేదికగా జరుగుతున్న ఒలింపిక్స్ క్రీడల్లో భారత్‌కు మరో పతకం ఖాయమైంది. భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగాట్ మహిళల 50 కేజీల ప్రీస్టైల్‌ ఈవెంట్‌లో ఫైనల్‌కు చేరింది. ఫలితంగా స్వర్ణ పతకానికి ఓ అడుగు దూరంలో నిలిచింది. 
 
సెమీఫైనల్లో క్యూబా రెజ్లర్ యుస్నీలిస్ గుజ్మన్‌‌తో జరిగిన బౌట్ లో 5-0తో విజయం సాధించింది. ఈ మ్యాచ్ ఆరంభం నుంచే ఫొగాట్ ఆధిపత్యం ప్రదర్శించింది. ప్రత్యర్థి నుంచి పెద్దగా ప్రతిఘటన లేకపోవడంతో తొలి పిరియడ్ ముగిసే సమయానికి పొగాట్ 1-0తో ఆధిక్యంలో నిలిచింది. రెండో పీరియడ్‌లో ఆమె 5-0తో భారీ ఆధిక్యాన్ని సాధించింది. ఈ ఆధిక్యాన్ని చివరి వరకు అలాగే కొనసాగించడంతో బౌట్ భారత వశమైంది.
 
ఇక స్వర్ణ కోసం జరిగే ఫైనల్ పోరులో అమెరికాకు చెందిన సారా హిల్డర్ బ్రాంట్‌తో వినేశ్ ఫోగాట్ తలపడనుంది. హిల్డర్ బ్రాంట్ సెమీఫైనల్లో మంగోలియాకు చెందిన డోల్గోర్ఖావిన్పై విజయం సాధించి ఫైనల్ చేరుకుంది. ఒలింపిక్స్ క్రీడల్లో రెజ్లింగ్ విభాగంలో ఫైనల్లో పతకం అందించనున్న తొలి భారతీయ మహిళ వినేశ్ ఫొగాట్ నిలవడం ఖాయమైంది. సెమీస్‌కు చేరిన తొలి మహిళగా ఇప్పటికే రికార్డు సృష్టించారు. కాగా 2016 ఒలింపిక్స్ క్వార్టర్స్ ఓడిపోయిన సాక్షి మాలిక్ కాంస్యం పతకంతో సరిపెట్టుకున్న విషయం తెల్సిందే. 
 
ఇదిలావుంటే, ఇక స్వర్ణ కోసం జరిగే ఫైనల్ పోరులో అమెరికాకు చెందిన సారా హిల్డర్ బ్రాంట్ తో వినేశ్ ఫోగాట్ తలపడనుంది. హిల్డర్ బ్రాంట్ సెమీఫైనల్లో మంగోలియాకు చెందిన డోల్గోర్ఖావిన్‌పై విజయం సాధించి ఫైనల్ చేరుకుంది. కాగా వినేశ్ ఫోగాట్ రౌండ్-16 బౌట్‌లో నాలుగుసార్లు ప్రపంచ ఛాంపియన్ అయిన జపాన్ క్రీడాకారిణి యుయి సుసాకిని ఆశ్చర్యకర రీతిలో మట్టికరిపించింది. 
 
సుసాకి ఒక అంతర్జాతీయ ఈవెంట్లో ఒక్కసారి కూడా ఓడిపోలేదు. ఆమె ఆడిన 82 బౌట్లు అన్నింటిలో విజయం సాధించింది. అలాంటి ప్రత్యర్థిని వినేశ్ ఓడించి సంచలనం సృష్టించింది. అద్భుతమైన ప్రదర్శన కనపరిచింది. ఆరంభంలో 0-2తో వెనుకబడినప్పటికీ.. చివరి 3-2తో బౌట్ను గెలుచుకుంది. ఆ తర్వాత క్వార్టర్ ఫైనల్స్ ఉక్రెయిన్ క్రీడాకారిణి ఒక్సానా లివాడ్‌పై 7-5 తేడాతో పొగాట్ విజయం సొంతం చేసుకుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఒలింపిక్స్‌లో ఫైనల్స్‌కు చేరిన తొలి భారతీయ మహిళా రెజ్లర్‌ వినేష్ ఫోగట్ రికార్డ్