Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

13న ఆరో బౌట్‌కు సిద్ధమైన విజేందర్ సింగ్ .. ప్రత్యర్థి అండ్రెజ్ సోల్డ్రా

Advertiesment
Vijender Singh
, ఆదివారం, 8 మే 2016 (15:37 IST)
ప్రొఫెషనల్ బాక్సింగ్ కెరీర్ అరంగేట్రం నుంచి ఇప్పటివరకు అపజయమన్నది లేకుండా సాగిపోతున్న భారత మల్లయుద్ధ వీరుడు విజేందర్‌సింగ్ ఆరో బౌట్‌కు సిద్ధమయ్యాడు. ఇప్పటివరకు బరిలోకి దిగిన ఐదు బౌట్లలో ప్రత్యర్థులను మట్టికరిపిస్తూ వస్తున్నాడు. 
 
ఈ పరిస్థితుల్లో ఈ నెల 13వ తేదీన బోల్టన్‌లోని మాక్రోన్ స్టేడియం వేదికగా జరిగే బౌట్‌లో పోలండ్‌కు చెందిన ప్రొఫెషనల్ బాక్సర్ అండ్రెజ్ సోల్డ్రాతో విజేందర్ అమీతుమీ తేల్చుకోనున్నాడు. మిడిల్ వెయిట్ విభాగంలో బరిలోకి దిగనున్న అండ్రెజ్‌కు అమెచ్యూర్ కెరీర్‌లో అద్భుత రికార్డు ఉంది. ఇప్పటివరకు 98 బౌట్లలో పోటీపడితే 82 విజయాలు సొంతం చేసుకున్నాడు. మరోవైపు 16 ప్రొఫెషనల్ బౌట్లలో రికార్డు స్థాయిలో 12 విజయాలతో జోరుమీదున్నాడు. 
 
ఇలా సమవుజ్జీగా కనిపిస్తున్న పోలండ్ బాక్సర్‌తో పోరుపై విజేందర్ స్పందిస్తూ సోల్డ్రా బౌట్లకు సంబంధించిన వీడియోలను చూశాను. అతను కఠినమైన ప్రత్యర్థి, రింగ్‌లో పోటీనివ్వడానికి తీవ్రస్థాయిలో కష్టపడుతున్నాను. అజేయ రికార్డును కొనసాగించేందుకు ఈ బౌట్ నాకెంతో ఎంతో కీలకమైనదన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

56 బంతుల్లో కోహ్లీ సెంచరీ... మళ్లీ శతకబాదిన కోహ్లి