Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గోల్ఫ్​ స్టార్​ టైగర్​ వుడ్స్​ కారు బోల్తా.. కాళ్లకు శస్త్ర చికిత్స

గోల్ఫ్​ స్టార్​ టైగర్​ వుడ్స్​ కారు బోల్తా.. కాళ్లకు శస్త్ర చికిత్స
, బుధవారం, 24 ఫిబ్రవరి 2021 (12:17 IST)
గోల్ఫ్​ స్టార్​ టైగర్​ వుడ్స్​కు మళ్లీ వార్తల్లో నిలిచారు. కెరీర్​లో 81 పీజీఏ టైటిళ్లు, 14 మేజర్​ ట్రోఫీలు, నాలుగుసార్లు మాస్టర్స్​ విజేతగా నిలిచాడు టైగర్​ వుడ్స్​. గోల్ఫ్​ చరిత్రలో మరెవ్వరికీ సాధ్యం కాని ఘనతలు అందుకుని దిగ్గజాలకే దిగ్గజం అనిపించుకున్నాడు టైగర్​ వుడ్స్. 
 
అంతేకాకుండా 2019లో ప్రెసిడెన్షియల్​ మెడల్​ ఆఫ్​ ఫ్రీడం పురస్కారం దక్కింది. తాజాగా టైగర్ వుడ్స్ కారు ప్రమాదంలో చిక్కుకున్నాడు. వాహనం తిరగబడిన ఘటనలో అతడి కాళ్లకు తీవ్రగాయాలయ్యాయి. పోలీసులు వెంటనే ఆస్పత్రిలో చేర్చగా.. వైద్యులు వుడ్స్​ కాళ్లకు శస్త్రచికిత్స చేశారు. 
 
అమెరికా లాస్ ​ఏంజెల్స్​లో బుధవారం ఉదయం ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. హుటాహుటిన ఆయనను అంబులెన్స్​లో ఆసుపత్రికి తరలించారు. లాస్​ ఏంజెల్స్​లోని ఓ టోర్నీకి అతిథిగా వుడ్స్​ హాజరయ్యారు. విజేతకు ట్రోఫీని అందజేశారు. అనంతరం ఈ ప్రమాదం జరిగింది.
 
ఈ ప్రమాదం జరిగే సమయంలో కారులో టైగర్​ వుడ్స్​ తప్ప మరేవరూ లేరని పోలీస్​ అధికారి స్పష్టం చేశారు. కారులో ఇరుక్కుపోయిన వుడ్స్​ను బయటకు తీసుకొచ్చేందుకు అద్దాన్ని పగులకొట్టాల్సి వచ్చిందని వెల్లడించారు. అయితే కారు లోపలి భాగంలో మాత్రం ఎలాంటి చెక్కుచెదరలేదని పేర్కొన్నాేరు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టైగర్ ఉడ్స్‌కు తప్పిన పెను ప్రమాదం... కాళ్ళకు సర్జరీ?