Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నా పట్ల దురుసుగా ప్రవర్తించారు... విస్తారా ఎయిర్‌లైన్స్‌కు దీపా మలిక్ ఫిర్యాదు

రియో పారాలింపిక్స్‌లో రజత కాంతులు విరజిమ్మిన దీపామలిక్ పట్ల ఎయిర్‌లైన్స్ సిబ్బంది దురుసుగా ప్రవర్తించారు. వీల్ చైర్ సర్వీస్, క్యాబిన్ క్రౌ సిబ్బంది తన పట్ల దురుసుగా వ్యవహరించిన తీరుపై ఆమె డొమెస్టిక్ వ

Advertiesment
నా పట్ల దురుసుగా ప్రవర్తించారు... విస్తారా ఎయిర్‌లైన్స్‌కు దీపా మలిక్ ఫిర్యాదు
, గురువారం, 6 అక్టోబరు 2016 (15:40 IST)
రియో పారాలింపిక్స్‌లో రజత కాంతులు విరజిమ్మిన దీపామలిక్ పట్ల ఎయిర్‌లైన్స్ సిబ్బంది దురుసుగా ప్రవర్తించారు. వీల్ చైర్ సర్వీస్, క్యాబిన్ క్రౌ సిబ్బంది తన పట్ల దురుసుగా వ్యవహరించిన తీరుపై ఆమె డొమెస్టిక్ విమానయాన సంస్థ ''విస్తారా''కు ఫిర్యాదు చేశారు. టాటా గ్రూప్, సింగపూర్‌కు చెందిన సంస్థ సంయుక్తంగా నిర్వహిస్తున్న యూకే 902 (విస్తారా) విమానంలో ముంబై-ఢిల్లీకి ఆమె ప్రయాణించింది. 
 
ఫిజికల్ హ్యాండీక్యాప్ వ్యక్తులను వీల్ చైర్ నుంచి సీట్లోనికి చేరవేయడం సరిగాలేదని, ఫ్లైట్ ఆలస్యంపై సిబ్బందిని అడగ్గా గట్టిగా అరిచి సమాధానం చెప్పారని దీపా వెల్లడించారు. తాను ఫోన్లో మాట్లాడటంపై వారు అభ్యంతరం వ్యక్తం చేశారని, ''స్వీట్ హార్ట్, చిల్'' అన్నారంటూ ''విస్తారా''కు ఆమె రాతపూర్వకంగా ఫిర్యాదు చేసింది. 
 
అంతేకాకుండా, వికలాంగులను ఏ విధంగా హ్యాండిల్ చేయాలనే విషయంపై ''విస్తారా''కు అసలు అవగాహనే లేదని, వీల్‌ఛైర్‌లో ఉన్నవారిని విమానం సీటులో ఏ విధంగా కూర్చోబెట్టాలనే కూడా వారికి తెలియలేదని ఆమె విమర్శించారు. తనను విమానం సీటులో కూర్చోబెట్టని సిబ్బంది ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ నిలబడిపోయారని, తనకు సాయం చేసేందుకు ఏ ఒక్కరూ ముందుకు రాలేదని దీపా ఆవేదన వ్యక్తం చేశారు. 
 
ఈ మేరకు ఆమె వరుస ట్వీట్లు సంధించింది. కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రి థావర్ చంద్ గెహ్లాట్‌కు కూడా ఈ ట్వీట్లను ట్యాగ్ చేశారు. ఈ విషయంలో విస్తారా తగుచర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నట్లు ఆమె ఫీడ్ బ్యాక్ బుక్కులో రాశారు. దీనిపై స్పందించిన విస్తారా సీఈఓ మీకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని దీనిపై పర్సనల్‌గా విచారణ జరుపుతానని ఆమెకు హామీ ఇచ్చారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సానియా మీర్జా వింత ఆకారంతో కూడిన వీడియో.. సోషల్ మీడియాలో వైరల్