Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సానియా మీర్జా వింత ఆకారంతో కూడిన వీడియో.. సోషల్ మీడియాలో వైరల్

సానియా మీర్జా అంటే భార‌త మ‌హిళా టెన్నిస్‌. భార‌త మ‌హిళా టెన్నిస్ అంటే సానియా మీర్జా. అంత‌గా పాపుల‌ర్ అయిపోయింది. ప్ర‌పంచ వ్యాప్తంగా ఆమెకు అభిమానులున్నారు. తెలంగాణ బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా నియ‌మించిన త‌ర్

Advertiesment
సానియా మీర్జా వింత ఆకారంతో కూడిన వీడియో.. సోషల్ మీడియాలో వైరల్
, గురువారం, 6 అక్టోబరు 2016 (15:05 IST)
సానియా మీర్జా అంటే భార‌త మ‌హిళా టెన్నిస్‌. భార‌త మ‌హిళా టెన్నిస్ అంటే సానియా మీర్జా. అంత‌గా పాపుల‌ర్ అయిపోయింది. ప్ర‌పంచ వ్యాప్తంగా ఆమెకు అభిమానులున్నారు. తెలంగాణ బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా నియ‌మించిన త‌ర్వాత ఆమె ల‌క్ మ‌రింతగా మారిపోయింది. వ‌రుస విజ‌యాల‌తో డ‌బుల్స్‌లో నెంబ‌ర్ వ‌న్ ర్యాంక్‌ని సొంతం చేసుకుంది. 
 
సానియా రీసెంట్‌గా ఒలింపిక్స్‌లో పేల‌వ‌మైన ప్ర‌ద‌ర్శ‌న ఇచ్చినా.. దానిని వెంట‌నే జ‌రిగిన ప‌లు ఇంట‌ర్నేష‌న‌ల్ ట్రోఫీల‌లో క‌వ‌ర్ చేసుకుంది. అయితే, ఆమె ప‌ర్స‌న‌ల్ వీడియో ఒక‌టి ప్ర‌స్తుతం నెట్‌లో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. ఈ వీడియోకు లైకులు, షేర్లు వెల్లువెత్తుతున్నాయి. సానియా మీర్జా సోషల్ మీడియాలో ఓ వింత వీడియోని పోస్ట్ చేసింది. సానియా పెట్టిన వీడియో చాలా సరదాగా ఉండి అందరిని ఆకట్టుకుంటోంది. అందులో ఆమె వింత ఆకారంలో కనపిస్తూ పెద్దగా నవ్వినట్టు కనబడుతుంది. 
 
గతంలో పరిమిత ఓవర్ల కెప్టెన్ ధోనీ కూడా తన కూతురితో కలిసి ఉన్న ఒక వీడియోనే సోషల్ మీడియాలో పెట్టాడు. సానియా పెట్టిన వీడియో కూడా అలానే ఉంది. ప్రత్యేకమైన సాంకేతిక యాప్ సహాయంతో వింతఆకారాల్లో కనిపించే ఆ వీడియో రికార్డ్ చేశారు. అయితే ఆ వీడియోతో పాటు ఫేమస్ ఫొటోగ్రాఫర్ అవినాష్ గోవరికర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ సానియా మీర్జా కామెంట్ పెట్టింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అంతర్జాతీయ క్రికెట్‌లో భారత్‌ను ఏకాకి చేద్ధాం : ఎహ్‌సాన్ మణి