Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఒలింపిక్ కమిటీ సభ్యురాలిగా నీతా అంబానీ.. ఆ కల నెరవేరింది..

ఒలింపిక్ కమిటీ సభ్యురాలిగా నీతా అంబానీ.. ఆ కల నెరవేరింది..
, శనివారం, 19 ఫిబ్రవరి 2022 (16:42 IST)
ఒలింపిక్ కమిటీ సభ్యురాలిగా నీతా అంబానీ మారారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దశాబ్దాల నాటి కల నెరవేరబోతుందంటూ హర్షం వ్యక్తం చేశారు. ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ తర్వాతి సదస్సు 2023లో జరగనుండగా ఈ కార్యక్రమానికి ముంబై వేదికగా కానుంది. ఐఓసీ సెషన్ 2022లో జరిగిన ఓటింగ్ కార్యక్రమంలో ద సిటీ ఆఫ్ డ్రీమ్స్ ముంబై పేరును అధికారికంగా ప్రకటించారు.
 
ఇండియన్ ఒలింపిక్ కమిటీ సభ్యుల జనరల్ మీటింగ్ నే ఐఓసీ సెషన్ అని చెబుతారు. ఐఓసీ నిర్ణయమే తుది నిర్ణయం కాగా ఓటింగ్ తర్వాత జియో వరల్డ్ సెంటర్ వేదికగా 2023 ఎడిషన్ నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు.
 
ఈ సందర్భంగా మాట్లాడిన నీతా అంబానీ.. "ప్రతిష్టాత్మకమైన ఒలింపిక్ ఈవెంట్‌కు ఆతిథ్యం ఇవ్వనున్నాం. ఆ భారత ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించడం గౌరవంగా భావిస్తున్నాను. ఒలింపిక్ మూమెంట్ లో ఇండియా ఏదో ఒక ప్రత్యేకమైనదాన్ని సృష్టించగలదని నిజంగా నమ్ముతున్నా. " అని ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ సభ్యురాలైన నీతా అంబానీ అన్నారు.
 
ఈ అనౌన్స్‌మెంట్ తర్వాత మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాకరే ట్విట్టర్ వేదికగా ఇది సాధించడానికి నీతా అంబానీ చేసిన కృషిని అభినందించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విరాట్ కోహ్లీ ఫిఫ్టీ-రోహిత్ శర్మ రికార్డు సమం