Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సానియా మీర్జా వేధింపులకు గురైందా..?

మహిళలకు రక్షణ కరువైంది. ప్రపంచ వ్యాప్తంగా మహిళలపై వేధింపులు పెచ్చరిల్లిపోతున్నాయి. సామాన్య మహిళల నుంచి సెలెబ్రిటీల వరకు వేధింపులు తప్పట్లేదు. తాజాగా భారత్ టెన్నిస్ స్టార్ సానియా మీర్జాపై ఓ బంగ్లాదేశీ

సానియా మీర్జా వేధింపులకు గురైందా..?
, సోమవారం, 10 సెప్టెంబరు 2018 (12:27 IST)
మహిళలకు రక్షణ కరువైంది. ప్రపంచ వ్యాప్తంగా మహిళలపై వేధింపులు పెచ్చరిల్లిపోతున్నాయి. సామాన్య మహిళల నుంచి సెలెబ్రిటీల వరకు వేధింపులు తప్పట్లేదు. తాజాగా భారత్ టెన్నిస్ స్టార్ సానియా మీర్జాపై ఓ బంగ్లాదేశీ క్రికెటర్ వేధింపులకు పాల్పడ్డాడు. కానీ ఈ వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తనతో కలిసి బంగ్లాదేశ్ పర్యటనకు వచ్చిన సానియాను ఓ బంగ్లా క్రికెటర్ వేధించినట్లు స్వయంగా షోయబ్ మాలిక్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 
 
బంగ్లాదేశ్ మీడియా వివరాల ప్రకారం.. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు నాలుగేళ్ల క్రితం నిర్వహించిన బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్(బీపీఎల్)లో పాల్గొనడానికి పాకిస్థాని క్రికెటర్ షోయబ్ మాలిక్ వెళ్లాడు. అతడితో పాటు భార్య సానియా మీర్జాను కూడా తీసుకెళ్లాడు. అయితే ఓ మ్యాచ్ సందర్భంగా గ్రౌండ్‌కు వెళ్లిన సానియాను బంగ్లా క్రికెటర్ షబ్బీర్ రహమాన్ అవమానకరంగా వ్యాఖ్యలు చేశాడు. దీంతో షోయబ్ మాలిక్ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు కూడా ఫిర్యాదు చేశాడు.
 
అయితే షబ్బీర్ రహమాన్ క్రికెటర్‌గా కంటే వివాదాస్పద క్రికెటర్‌గా బాగా పేరు తెచ్చుకున్నాడు. సానియా వేధింపుల తర్వాత కూడా ఇతడు ఓ అభిమానిపై దాడి చేసి వార్తల్లో నిలిచాడు. తాజాగా సోషల్ మీడియాలో ఓ అభిమానికి దూషించడంతో అతడిపై బంగ్లా క్రికెట్ బోర్డు ఆరు నెలల నిషేదం విధించింది. దీంతో అతడు ఆసియా కప్‌తో పాటు దేశీయ క్రికెట్‌కు కూడా దూరం కానున్నాడు. ఈ నేపథ్యంలో షోయబ్ మాలిక్ ఇచ్చిన ఫిర్యాదు ప్రస్తుతం చర్చనీయాంశమైంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ముచ్చటగా మూడోసారి.. పీట్ సంప్రాస్ సరసన నోవాక్ జకోవిచ్