Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

డబుల్స్ ర్యాంకింగ్స్‌: 80 వారాల పాటు నెం.1 ర్యాంకులో సానియా.. సరికొత్త రికార్డు..

మహిళ డబుల్స్ ర్యాంకింగ్స్‌లో వరుసగా 80వారాల పాటు నెంబర్ వన్ క్రీడాకారిణిగా నిలిచి భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా రికార్డు సృష్టించింది. గత సీజన్‌లో మార్టినా హింగిస్‌తో కలసి వోల్వో కార్ ఓపెన్ టైటిల

Advertiesment
Sania Mirza completes 80 consecutive weeks as World No.1
, బుధవారం, 19 అక్టోబరు 2016 (18:38 IST)
మహిళ డబుల్స్ ర్యాంకింగ్స్‌లో వరుసగా 80వారాల పాటు నెంబర్ వన్ క్రీడాకారిణిగా నిలిచి భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా రికార్డు సృష్టించింది. గత సీజన్‌లో మార్టినా హింగిస్‌తో కలసి వోల్వో కార్ ఓపెన్ టైటిల్ గెలిచి నంబర్ వన్ ర్యాంక్‌ను కైవసం చేసుకున్న సానియా మీర్జా అప్పటి నుంచి అగ్రస్థానంలోనే కొనసాగుతూనే ఉంది.

డబుల్స్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉండటంపై సానియా మీర్జా హర్షం వ్యక్తం చేసింది. భారతదేశం తరపున నంబర్ వన్ ర్యాంక్‌ను దక్కించుకున్న టెన్నిస్ క్రీడాకారిణిగా నిలవడం ఎంతో సంతోషంగా ఉందని సానియా మీర్జా పేర్కొంది. 
 
టెన్నిస్‌లో ఇదో అద్భుత జర్నీగా సానియా మీర్జా పేర్కొంది. పోటీల్లో మెరుగ్గా రాణించేందుకు సాయశక్తులాగా కృషి చేస్తానని.. మరింత కష్టపడేందుకు ఇది స్ఫూర్తిగా నిలుస్తుందని సానియా మీర్జా ట్వీట్ చేసింది. ఇక సానియా సాధించిన రికార్డుకు సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

సానియా సాధించిన ఘనతకు మహేష్ భూపతి, పీవీ సింధు, గుత్తా జ్వాలలు ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలియజేశారు. కాగా హైదరాబాదీ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, మార్టినా హింగిస్‌లు కలసి 12 నెలల్లో ఏకంగా 13 టైటిళ్లు సొంతం చేసుకున్నారు. వరుసగా 41 మ్యాచ్‌లు గెలిచారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

6 నెలల క్రితమే వివాహం.. కబడ్డీ క్రీడాకారుడు రోహిత్ కుమార్ భార్య ఆత్మహత్య ఎందుకు?