హల్లో సానియా.. ఎపుడూ ఆటలేనా? తల్లెప్పుడౌతావ్? జర్నలిస్టుపై కన్నెర్రజేసిన టెన్నిస్ భామ!
భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జాకు జీవితంలో ఇప్పటివరకు ఎన్నడూ ఊహించని ప్రశ్న ఒకటి ఎదురైంది. ప్రముఖ ఇంగ్లీష్ చానెల్ ఇండియాటుడే-ఆజ్‌తక్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమెకు దిమ్మదిరిగిపోయే ప్రశ్న ఒకటి ఎద
భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జాకు జీవితంలో ఇప్పటివరకు ఎన్నడూ ఊహించని ప్రశ్న ఒకటి ఎదురైంది. ప్రముఖ ఇంగ్లీష్ చానెల్ ఇండియాటుడే-ఆజ్‌తక్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమెకు దిమ్మదిరిగిపోయే ప్రశ్న ఒకటి ఎదురైంది.
అదీ కూడా అలాంటి ప్రశ్న వేసిందీ.. ఆషామాషీ విలేఖరి కాదు. ప్రముఖ జర్నలిస్టు రాజ్‌దీవ్ సర్దేశాయ్. ఆత్మకథ ఏస్ అగైన్స్ట్ ఆడ్స్ పుస్తకం రిలీజ్‌ను పురస్కరించుకుని సానియా ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇందులో సానియాను.. తల్లెప్పుడౌతావ్, జీవితంలో ఎప్పుడు స్థిరపడతావ్ అంటూ రాజ్‌దీప్ ప్రశ్నించారు.
దీంతో ఒక్కసారిగా సానియా హావభావాలు పూర్తిగా మారిపోయి.. ఆయనపై కన్నెర్ర చేశారు. తాను సాధించిన మెడళ్లు కనపడటం లేదా అంటూ అసహనం వ్యక్తం చేశారు. ఆలస్యంగా అర్థం చేసుకున్న రాజ్‌దీప్ సారీ చెప్పారు. తాను ఇప్పటి వరకూ పురుష క్రీడాకారులను కూడా అడగని ప్రశ్న అడిగినందుకు సారీ చెప్పారు.