Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

29న పీవీ సింధూకు ఖేల్ రత్న అవార్డు : పీవీకి హైదరాబాదులో ఘనస్వాగతం..

రియో ఒలింపిక్స్‌లో రజతం సాధించిన భారత షట్లర్, తెలుగమ్మాయి పివి సింధు సోమవారం దేశానికి రానుంది. ఈ నేపథ్యంలో రియో ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ విభాగంలో రజత పతకాన్ని సాధించిన విదేజ పుసర్ల వెంకట సింధూకు దేశ అత

Advertiesment
PV Sindhu's Olympic silver to be followed by Khel Ratna award
, ఆదివారం, 21 ఆగస్టు 2016 (13:41 IST)
రియో ఒలింపిక్స్‌లో రజతం సాధించిన భారత షట్లర్, తెలుగమ్మాయి పివి సింధు సోమవారం దేశానికి రానుంది. ఈ నేపథ్యంలో రియో ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ విభాగంలో రజత పతకాన్ని సాధించిన విదేజ పుసర్ల వెంకట సింధూకు దేశ అత్యున్నత "ఖేల్ రత్న'' అవార్డు దక్కింది. ఈ నెల 29న ఢిల్లీలో సింధూకు ఖేల్ రత్న అవార్డును బహూకరించనున్నట్టు కేంద్రం ప్రకటించింది. 
 
కాగా, రెజ్లింగ్‌లో వినీత్ ఫోగత్ కాంస్యం గెలుచుకోగానే, ఆమెకు ఖేల్ రత్న ఇవ్వాలని క్రీడాశాఖ సిఫార్సు చేసిన సంగతి తెలిసిందే. ఆ వెంటనే గంటలు తిరక్కుండానే సింధూ పతకాన్ని ఖాయం చేసుకోవడంతో ఖేల్ రత్న ఆమె వశం కానుంది. కాగా, 28న సింధూకు ఓ కారును బహుమతిగా ఇవ్వనున్నట్టు లెజండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ప్రకటించారు.
 
ఇదిలా ఉంటే.. రియో ఒలింపిక్స్‌లో రజతం సాధించిన భారత షట్లర్, తెలుగమ్మాయి పివి సింధు సోమవారం నగరానికి రానుంది. సోమవారం హైదరాబాద్ చేరుకోనున్న సింధుకు ఘన స్వాగతం పలికేందుకు తెలంగాణ ప్రభుత్వం, జీహెచ్‌ఎంసీ భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పీవీ సింధు ఫిజియోథెరపిస్టు ఎవరో తెలుసా..? సిల్వర్ మెడల్‌లో కిరణ్ పాత్ర