పీవీ సింధు ఫిజియోథెరపిస్టు ఎవరో తెలుసా..? సిల్వర్ మెడల్‌లో కిరణ్ పాత్ర
రియో ఒలింపిక్స్‌లో పీవీ సింధు ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ కిరణ్ చల్లగుండ్ల కీలక పాత్ర పోషించారనే చెప్పాలి. క్రీడాకారులకు ఫిట్‌నెస్ అనేది చాలా ముఖ్యం. ఫిట్ నెస్ సూచనలు చేయడంలో ఫిజియోథెరపిస్టుల సేవలు కూడా
రియో ఒలింపిక్స్‌లో పీవీ సింధు ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ కిరణ్ చల్లగుండ్ల కీలక పాత్ర పోషించారనే చెప్పాలి. క్రీడాకారులకు ఫిట్‌నెస్ అనేది చాలా ముఖ్యం. ఫిట్ నెస్ సూచనలు చేయడంలో ఫిజియోథెరపిస్టుల సేవలు కూడా కీలకం. రియో ఒలింపిక్స్‌లో భారత్ పతాకాన్ని ఎగుర వేసి సిల్వర్ మెడల్ సాధించిన సింధూ ఫిజియోథెరఫిస్టు గుంటూరు జిల్లా వాడే.
2010 కామన్‌వెల్త్ క్రీడలు, 2012 ఒలింపిక్స్ క్రీడలకు, ఏషియన్ గేమ్స్‌కు కూడా కిరణ్ ఫిజియోథెరపిస్టుగా వ్యవహరించారు. పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీకి కూడా ఫిజియో సేవలు అందిస్తున్నారు. డాక్టర్ కిరణ్ స్పోర్ట్స్ ఫిజియోథెరపీ డిగ్రీ, ఆస్ట్రేలియా సౌత్ యూనివర్శిటీ డిగ్రీ పొందారు. ఇండియన్ బ్యాడ్మింటన్ అసోసియేషన్‌కు డాక్టర్ కిరణ్ విస్తృత సేవలు అందిస్తున్నారు.
గుంటూరు పిడుగురాళ్ళ మండలం గణేషునిపాడుకు చెందిన డాక్టర్ కిరణ్ చల్లగుండ్ల ఆమెకు ఫిజియోథెరపిస్టుగా వ్యవహరిస్తున్నారు. ఫిజియో ట్రైనర్, కండీషనింగ్ కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఈయన, ఎన్‌టీఆర్ హెల్త్ వర్సిటీ నుంచి ఏకైక న్యూరోడైనమిక్ సొల్యూషన్ టీచర్‌గా కూడా కిరణ్ పేరొందారు.