Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పీపీ సింధుకు ఘన స్వాగతం... ఎయిర్‌పోర్టులో ఏపీ - టీఎస్ మంత్రులు క్యూ...

సాధారణంగా మంత్రులను ఎవరైనా కలవాలంటే వాళ్ల పేషీల దగ్గర, ఇళ్ల దగ్గర క్యూలో నిలబడాల్సి ఉంటుంది. కానీ, సోమవారం శంషాబాద్ విమానాశ్రయంలో అరుదైన దృశ్యం కనిపించింది.

Advertiesment
PV Sindhu
, సోమవారం, 22 ఆగస్టు 2016 (12:31 IST)
సాధారణంగా మంత్రులను ఎవరైనా కలవాలంటే వాళ్ల పేషీల దగ్గర, ఇళ్ల దగ్గర క్యూలో నిలబడాల్సి ఉంటుంది. కానీ, సోమవారం శంషాబాద్ విమానాశ్రయంలో అరుదైన దృశ్యం కనిపించింది. రియో ఒలింపిక్స్‌లో మహిళల బ్యాడ్మిటన్ సింగిల్స్ విభాగంలో రజత పతకం సాధించిన పీవీ సింధు, ఆమె కోచ్ పుల్లెల గోపీచంద్‌కు స్వాగతం పలికేందుకు రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన మంత్రులు ఎయిర్‌కు క్యూకట్టారు. 
 
పీవీ సింధు, గోపీచంద్‌లు సోమవారం ఉదయం బ్రెజిల్ నుంచి హైదరాబాద్‌కు వచ్చారు. దీంతో వారిద్దరికి స్వాగతం పలికేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన పలువురు మంత్రులు క్యూలో నిలబడ్డారు. విమానాశ్రయంలో సాధారణంగా విదేశాల నుంచి వచ్చేవాళ్ల కోసం 'ఇంటర్నేషనల్ అరైవల్స్' ద్వారం ఉంటుంది. సింధు, గోపీ తదితరులను మాత్రం ప్రత్యేకంగా అత్యవసర ద్వారం మీదుగా తీసుకొచ్చారు.
 
సింధు తండ్రి పీవీ రమణ స్వయంగా లోపలకు వెళ్లి.. వాళ్లను తొడ్కొచ్చారు. విమానం దిగిన విషయం, సింధు వస్తున్న విషయం తెలియగానే అప్పటివరకు లాంజ్‌లో కూర్చున్న మంత్రులంతా ఒక్కసారిగా అప్రమత్తమై.. ఆ ద్వారం వెలుపల ఒకరి తర్వాత ఒకరు వరుసగా నిల్చుని చేతుల్లో పూలబొకేలు పట్టుకున్నారు. అత్యంత పటిష్టమైన భద్రత నడుమ బయటకు వచ్చిన సింధు అతి కొద్దిమంది ప్రముఖుల నుంచి మాత్రమే బొకేలను స్వీకరించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టెస్టు ర్యాంకింగ్ గోవిందా..? కోహ్లీ సారథ్యంలో విండీస్‌ గడ్డపై ర్యాంకు దిగజారేనా?