Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఫ్యాషన్‌లోనూ పీవీ సింధు పాపులారిటీ..ఏ మ్యాగజైన్ కోసం.. ఫోజులు అదుర్స్

ప్రతిష్టాత్మక ఒలింపిక్ పోటీల్లో మెరుగైన ఆటతీరును ప్రదర్శించి రజత పతకం సాధించిన తెలుగుతేజం పీవీ సింధు.. ఫ్యాషన్‌‍లోనూ పాపులారిటీ సంపాదించుకుంటోంది. భారత్‌కు రజత పతకం సాధించిన తర్వాత పీవీ సింధు క్రేజ్ అ

Advertiesment
PV Sindhu on the Covershoot of Elle Magazine December 2016
, బుధవారం, 7 డిశెంబరు 2016 (16:26 IST)
ప్రతిష్టాత్మక ఒలింపిక్ పోటీల్లో మెరుగైన ఆటతీరును ప్రదర్శించి రజత పతకం సాధించిన తెలుగుతేజం పీవీ సింధు.. ఫ్యాషన్‌‍లోనూ పాపులారిటీ సంపాదించుకుంటోంది. భారత్‌కు రజత పతకం సాధించిన తర్వాత పీవీ సింధు క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఆటతో పాటు ఫ్యాషన్‌లో పీవీ సింధు అదరగొడుతూ.. భారతీయ క్రీడాకారులకు రోల్ మోడల్‌గా నిలుస్తోంది. 
 
కెమెరా ముందు స్టిల్స్‌తో ఆకట్టుకుంటూ.. ఈవెంట్లలోనూ మెరుగ్గా ఆడుతూ మంచి మార్కులు కొట్టేస్తోంది. ఆఫ్ ది ఫీల్డ్‌లో సింధు ప్రత్యేకతను చాటుకుంటూ వివిధ రకాల డ్రస్సుల్లో స్టైల్‌గా కనిపిస్తోంది. రియో ఒలింపిక్స్ తర్వాత సింధు స్టైలే మారిపోయింది. బ్రాండ్ అంబాసిడార్‌గా కేక పుట్టిస్తోంది. ఫోటో షూట్‌లలోనూ తళుక్కుమంటోంది. 
 
తాజాగా ఎలై మ్యాగజైన్ డిసెంబర్ కవర్ పేజీకి కూడా ఎక్కింది. ఫ్యాషన్‌లో ట్రెండ్ సెట్టర్‌గా మారుతోందని ఫ్యాన్స్ అంటున్నారు. మొత్తానికి 2016 సీజన్ సింధుకు బాగా కలిసొచ్చిందని క్రీడా పండితులు అంటున్నారు. మరి వచ్చే ఏడాది కూడా పీవీ సింధు టోర్నీల్లో మెరుగ్గా రాణించాలని ఆశిద్దాం..

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

యువీ-హాజల్ బాటలో జహీర్ ఖాన్-సాగరిక.. త్వరలో డుం.. డుం.. డుం..?