యువీ-హాజల్ బాటలో జహీర్ ఖాన్-సాగరిక.. త్వరలో డుం.. డుం.. డుం..?
టీమిండియా క్రికెటర్ యువరాజ్ సింగ్, హాజెల్ కీచ్‌ల వివాహం అట్టహాసంగా జరిగిన నేపథ్యంలో.. మరో క్రికెటర్ పెళ్ళికి సిద్ధమైపోతున్నాడు. గత కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్న యువరాజ్ సింగ్, హాజెల్ కీచ్‌ల జోడీ గత వ
టీమిండియా క్రికెటర్ యువరాజ్ సింగ్, హాజెల్ కీచ్‌ల వివాహం అట్టహాసంగా జరిగిన నేపథ్యంలో.. మరో క్రికెటర్ పెళ్ళికి సిద్ధమైపోతున్నాడు. గత కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్న యువరాజ్ సింగ్, హాజెల్ కీచ్‌ల జోడీ గత వారంలో మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. తాజాగా మరో టీమిండియా మాజీ క్రికెటర్ జహీర్ ఖాన్ కూడా త్వరలో ప్రేమ పెళ్లి చేసుకుంటున్నాడు.
షారుఖ్ ఖాన్ కోచ్‌గా బాలీవుడ్‌లో వచ్చిన చక్‌దే ఇండియా సినిమా ఫేమ్ సాగరిక గట్గెతో జహీర్ ఖాన్ చెట్టపట్టాలేసుకుని తిరుగుతున్న ఫోటోలు ఇప్పుడు ఇంటర్నెట్‌లో హల్ చల్ చేస్తున్నాయి. డిసెంబర్ 2న గోవాలో జరిగిన యువీ పెళ్లికి సాగరికతో కలిసి జహీర్ హాజరయ్యాడు. ఇప్పటికే విరాట్ కోహ్లీ, అనుష్క శర్మలు యువీ పెళ్లికి జంటగా హాజరైన నేపథ్యంలో.. జహీర్ ఖాన్ కూడా సాగరికతో కలిసి పెళ్లికి హాజరయ్యాడు.