Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తిరుపతిలో జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు ప్రారంభం, ఎన్ని రాష్ట్రాల నుంచి వచ్చారంటే..?

తిరుపతిలో జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు ప్రారంభం, ఎన్ని రాష్ట్రాల నుంచి వచ్చారంటే..?
, బుధవారం, 5 జనవరి 2022 (22:52 IST)
తిరుపతి వేదికగా జాతీయ క్రీడల నిర్వహణ చారిత్రాత్మక ఘట్టమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె.నారాయణస్వామి  పేర్కొన్నారు. తిరుపతి నగరపాలక సంస్థ  ఆద్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నేటి నుంచి ఈ నెల 9 వ తేది వరకు జరగనున్న జాతీయ మహిళా, పురుషుల ఆహ్వాన కబడ్డీ పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమం తిరుపతి ఇందిరా మైదానంలో అట్టహాసంగా జరిగింది. వివిధ రాష్ట్రాల  నుండి 42 జట్లు ఈ పోటీలలో పాల్గొంటున్నాయి. 

 
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మాట్లాడుతూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ దేశవ్యాప్తంగా ఉన్న కబడ్డీ క్రీడాకారులను ఒక వేదికగా తిరుపతి ఇందిరా మైదానంలో జాతీయ స్థాయి కబడ్డీ పోటీల నిర్వహణకు కృషి చేసిన తిరుపతి శాసనసభ్యులను  అభినందించారు. క్రీడాకారులందరూ తమ క్రీడా ప్రతిభను ప్రదర్శించాలన్నారు. 

 
ద్రోణాచార్య అవార్డు గ్రహీత, ప్రముఖ బాడ్మింటన్ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్ మాట్లాడుతూ కోవిడ్ తరువాత జరుగుతున్న క్రీడా పోటీలకు తిరుపతి ఆతిద్యం ఇవ్వడం విశేషమన్నారు. క్రీడా స్పూర్తిని పెంపొందించేందుకు ఈ జాతీయ  పోటీలు తోడ్పడతాయన్నారు. తిరుపతి వేదికగా నిర్వహిస్తున్న జాతీయ కబడ్డీ పోటీలలో పాల్గొంటున్న  క్రీడాకారులందరు క్రమశిక్షణతో ఉంటూ అంకితబావంతో క్రీడలలో రాణించాలని తిరుమల వెంకటేశ్వర స్వామి ఆశీసులు ప్రతి ఒక్కరిపైన ఉంటాయని తెలిపారు. జాతీయ కబడ్డీ పోటీల నిర్వహణకు కృషి చేసిన తిరుపతి శాసనసభ్యులకు, అధికారులందరికీ ధన్యవాదాలు తెలిపారు. 

 
అర్జున్ అవార్డు గ్రహీత హోన్నప్ప గౌడ్ మాట్లాడుతూ  ఈ పోటీల నిర్వహణకు విశేష కృషి చేసిన ప్రతి అధికారికి ధన్యవాదాలు తెలిపారు.  క్రీడాకారులు క్రమశిక్షణతో పోటీలలో ఉండాలన్నారు. తిరుపతిలో కబడ్డీ క్రీడాకారులకు అన్ని వసతులు ఏర్పాటు చేశారని తెలిపారు. క్రీడాకారులందరూ  కష్టపడి అంకిత బావంతో క్రీడల్లో రాణించి ఉన్నత స్థానం చేరుకోవాలని తెలిపారు. 

 
చిత్తూరు ఎం.పి  రెడ్డెప్ప మాట్లాడతూ గ్రామీణ క్రీడ అయిన కబడ్డీ పోటీలను తిరుపతిలో జాతీయ స్థాయిలో నిర్వహించడం గొప్ప విషయమని క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు. తిరుపతి ఎం.పి. డాక్టర్  గురుమూర్తి మాట్లాడుతూ అంతరించి పోతున్న గ్రామీణ క్రీడలకు ఉత్తేజాన్ని అందిస్తూ తిరుపతిలో జాతీయ కబడ్డీ పోటీలు నిర్వహించేందుకు కృషి చేసిన అందరిని అభినందించారు. 

 
జిల్లా కలెక్టర్ ఎం.హరినారాయణన్ మాట్లాడుతూ  నేడు సంతోషకరమైన రోజు అని,  తిరుపతి అంటే ఆద్యాత్మిక నగరంగానే ఉండేదని ప్రస్తుతం క్రీడల నిర్వహణ ద్వారా నగర ప్రజలకు క్రీడా స్పూర్తిని పెంపొందించేందుకు చొరవ చూపడం ఈ విషయంలో తిరుపతి నగరపాలక సంస్థ  ఆద్వర్యంలో జరగడం శుభపరిణామం అన్నారు. ప్రస్తుతం పిల్లలు ఎక్కువగా సెల్ ఫోన్లకు , లాప్టాప్‌లకు ఎక్కువ సమయం కేటాయించడం ద్వారా అనేక సమస్యలు ఎదురవుతున్నాయని దీని నివారణకు పిల్లలలో క్రీడల పట్ల ఆసక్తి పెంపొందించేందుకు ఈ జాతీయ  క్రీడలు తోడ్పడతాయని తెలిపారు.

 
తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ తిరుపతిని ఆద్యాత్మిక నగరంతో పాటు  ఆటల కేంద్రంగా  చేస్తామన్నారు. నేటితరం పిల్లలు ఆదునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన సెల్ ఫోన్లు, లాప్ టాప్ లకు  ఎక్కువ సమయం కేటాయించకుండా క్రీడ, సాంస్కృతిక కార్యక్రమాలకు సమయాన్ని కేటాయించేలా కృషి చేయాలన్నారు. భావితరాలకు క్రీడా స్పూర్తిని అందించేందుకు ఈ పోటీలను నిర్వహించడం జరుగుతున్నదని, ఆద్యాత్మిక నగరమైన తిరుపతిలో జాతీయ స్థాయి కబడ్డీ పోటీల నిర్వహణకు మరియు ఈ కార్యక్రమ విజయవంతానికి సహాయసహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సౌరవ్ గంగూలీ కుమార్తెకు కరోనా.. డెల్టా రకమని తేలింది...