Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రియోలో బాలీవుడ్ సాంగ్‌ సూపర్ హిట్... 'ఐలా రే' సాంగ్‌కు ఈత కొలనులో అద్భుత విన్యాసాలు (video)

బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ నటించిన 'కట్టామిట్టా' చిత్రం. ఈ చిత్రం 2010లో విడుదలైంది. ఇందులోని 'ఐలా రే ఐలా' పాటకు రియో ఒలింపిక్స్ ఈత కొలనులో మెక్సికన్ సింక్రనైజెడ్‌ స్విమింగ్‌ బృందం అద్భుతమైన విన్యా

Advertiesment
Mexican Swim Team
, బుధవారం, 17 ఆగస్టు 2016 (14:52 IST)
బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ నటించిన 'కట్టామిట్టా' చిత్రం. ఈ చిత్రం 2010లో విడుదలైంది. ఇందులోని 'ఐలా రే ఐలా' పాటకు రియో ఒలింపిక్స్ ఈత కొలనులో మెక్సికన్ సింక్రనైజెడ్‌ స్విమింగ్‌ బృందం అద్భుతమైన విన్యాసాలను జోడించింది. ప్రస్తుతం ఈ పాటతో కూడిన అద్భుత విన్యాసాల వీడియో సోషలో మీడియాలో వైరల్‌గా మారింది. 
 
బాలీవుడ్‌ ఐటెం సాంగ్‌ 'ఐలా రే ఐలా' నేపథ్యంగా తీసుకొని అద్భుతమైన విన్యాసాలు చేసింది. డ్యుయెట్‌ టెక్నికల్ రోటిన్ ప్రిలిమినరీ రౌండ్‌లో మెక్సికన్ సింక్రనైజెడ్ స్విమ్మర్లైన కరెమ్‌ ఆషాష్‌, నురియా డయోస్‌దాదో ఈ పాటకు తగినట్టు విన్యాసాలు చేస్తూ అలరించారు. అంతేకాకుండా ఫైనల్‌‌కు ఈ అమ్మాయిల జోడీ క్వాలిఫై అయింది. 
 
2010లో వచ్చిన తన 'కట్టామిట్టా' సినిమాలోని పాటకు మెక్సికన్ అమ్మాయిలు విన్యాసాలు చేయడంతో మురిసిపోయిన అక్షయ్‌కుమార్ వారికి ట్విట్టర్‌లో అభినందనలు తెలిపారు. వారి విన్యాసాలు సూపర్‌గా ఉన్నాయని కొనియాడాడు. సినిమా సంగీత దర్శకుడు ప్రీతం కూడా ఇలా తన పాట రియోలో మోగడంపై సంతృప్తి వ్యక్తం చేశారు.

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆస్ట్రేలియా- శ్రీలంక మూడో టెస్టు: స్టంపౌట్ వివాదం.. పాదాన్ని గాల్లోకి లేపాడు..