Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆస్ట్రేలియా- శ్రీలంక మూడో టెస్టు: స్టంపౌట్ వివాదం.. పాదాన్ని గాల్లోకి లేపాడు..

ఆస్ట్రేలియా- శ్రీలంక మధ్య టెస్టు మ్యాచ్‌ వివాదానికి దారితీసింది. తాజాగా కొలంబోలో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్‌లో ఓ స్టంపౌట్ వివాదం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. శ్రీలంక బ్యాట్స్‌మెన్‌ కరుణరత్నె మాత్

ఆస్ట్రేలియా- శ్రీలంక మూడో టెస్టు: స్టంపౌట్ వివాదం.. పాదాన్ని గాల్లోకి లేపాడు..
, బుధవారం, 17 ఆగస్టు 2016 (14:49 IST)
ఆస్ట్రేలియా- శ్రీలంక మధ్య టెస్టు మ్యాచ్‌ వివాదానికి దారితీసింది. తాజాగా కొలంబోలో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్‌లో ఓ స్టంపౌట్ వివాదం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. శ్రీలంక బ్యాట్స్‌మెన్‌ కరుణరత్నె మాత్రం క్రీడాస్పూర్తి ప్రదర్శించాడు. ఆసీస్‌ ఆటగాళ్లపై ఎలాంటి అసహనం ప్రదర్శించకుండా పెవిలియన్‌ బాట పట్టి అందరి మనసులు గెలిచాడు కరుణరత్నె. ఆసీస్ వికెట్ కీపర్‌ పీటర్‌ నెవిల్‌ తాజా సిరీస్‌లో బ్యాట్‌తో ఘోరంగా విఫలమైనా.. ఒక స్టంపౌట్‌తో అందరి దృష్టిని ఆకర్షించాడు.
 
వివరాల్లోకి వెళితే.. నాలుగో రోజు (మంగళవారం) ఆస్ట్రేలియా వికెట్ కీపర్ శ్రీలంక ఓపెనర్‌ కరుణరత్నెను రెప్పపాటులో ఔట్ చేశాడు. ఇన్నింగ్స్‌ 13వ ఓవర్‌ బౌలింగ్‌ చేసిన ఆస్ట్రేలియా స్పిన్నర్‌ లియాన్‌ బౌలింగ్‌లో బంతిని డిఫెన్స్‌ చేసేందుకు కరుణరత్నె ప్రయత్నించాడు. కానీ బంతి అతను వూహించని రీతిలో టర్న్‌ తీసుకుని వికెట్‌ కీపర్‌ పీటర్‌ నెవిల్‌ చేతుల్లోకి వెళ్లింది. దీంతో నిరాశ చెందిన కరుణరత్నె ఆ బంతిని ఎలా ఆడిండాల్సిందో ఓసారి రిహార్సల్స్‌లా ప్రయత్నించాడు. అయితే అప్రయత్నంగానే కరుణరత్నె క్రీజులోని తన పాదాన్ని గాల్లోకి లేపాడు. మొదటి నుంచి అతని పాదాల కదలికలను నిశితంగా గమనిస్తున్న కీపర్‌ నెవిల్‌ అదే అదునుగా భావించి బంతితో వికెట్ పడగొట్టాడుయ 
 
క్షణాల్లో జరిగిపోయిన ఈ స్టంపౌట్‌ను అంపైర్లు మూడో అంపైర్‌కు నివేదించారు. వీడియోను పరిశీలించిన థర్డ్‌ అంపైర్‌ కరుణరత్నె ఔట్‌గా ప్రకటించాడు. ఈ నిర్ణయంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఆసీస్‌ కీపర్‌ క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించాడంటూ ఓ వర్గం దుమ్మెత్తిపోయగా.. అది వికెట్‌ కీపర్‌ తెలివితేటలంటూ మరో వర్గం మద్దతు పలికింది. ఈ స్టంపౌట్‌ను ఆడమ్ గిల్ క్రిస్ట్ సమర్థించడం విశేషం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రియో ఒలింపిక్స్ : పేస్- భూపతిల ఏథెన్స్ ఒలింపిక్స్ గుర్తుకొస్తోందన్న సానియా