తక్కువ డబ్బుతో జీవితం ఎలా గడపాలో తెలిసింది : మేరీకోమ్
దేశంలో పెద్ద విలువ కలిగిన కరెన్సీ నోట్లు రూ.500, రూ.1000ను రద్దు చేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయంపై ప్రముఖ బాక్సర్, రాజ్యసభ సభ్యురాలు మేరీకోమ్ స్పందించారు. ఈ తరహా నిర్ణయం వల్ల బడా బా
దేశంలో పెద్ద విలువ కలిగిన కరెన్సీ నోట్లు రూ.500, రూ.1000ను రద్దు చేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయంపై ప్రముఖ బాక్సర్, రాజ్యసభ సభ్యురాలు మేరీకోమ్ స్పందించారు. ఈ తరహా నిర్ణయం వల్ల బడా బాబుల నుంచి సామాన్య ప్రజానీకం వరకు కష్టాలు పడుతున్నారని అన్నారు.
అయితే, ఈ నిర్ణయం వల్ల ప్రజలు కొన్ని రోజుల పాటు ఇబ్బందులు పడినా... అతి తక్కువ డబ్బుతో ఎలా గడపాలో కొత్త అనుభవం వస్తుందని చెప్పింది. ప్రధాని మోడీ ధైర్యంగా తీసుకున్న ఈ నిర్ణయంతో దేశ భవిష్యత్తు బాగుంటుందని, అందుకే తన సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్టు ప్రకటించారు. కాగా, ఈమె మంగళవారం రాజ్యసభ సభ్యురాలిగా ప్రమాణం చేశారు.